Share News

రేవంత్‌ది తుగ్లక్‌ పాలన: హరీశ్‌

ABN , Publish Date - Jun 23 , 2026 | 02:36 AM

రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి పాలన తుగ్లక్‌ను మరిపిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో...

రేవంత్‌ది తుగ్లక్‌ పాలన: హరీశ్‌

అచ్చంపేట, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి పాలన తుగ్లక్‌ను మరిపిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు సర్‌పై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం రాక ముందు ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి, ఆ తర్వాత ప్రజలను నట్టేట ముంచారన్నారు. కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్‌ ప్రభుత్వం రైతు బంధును పక్కాగా అమలు చేసిందన్నారు. ఏడాదికి మూడుసార్లు రైతు బంధు ఇవ్వాలని చెప్పిన రేవంత్‌రెడ్డి రెండున్నరేళ్లలో మూడుసార్లు రైతుబంధు సాయం రూ.29,358 కోట్లు ఎగ్గొట్టారని విమర్శించారు. భూమి తలకిందులైనా రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, వచ్చే అసెంట్లీ ఎన్నికల్లో తమకు 100 సీట్లు రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు.

Updated Date - Jun 23 , 2026 | 02:36 AM