బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి: హరీశ్‌రావు
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:02 AM
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, దేశ ఆర్థికవృద్ధికి ఇంజన్‌లా ఉన్న ఈ రాష్ట్రానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో మొండిచేయి చూపారని బీఆర్‌ఎస్ శాసన సభా పక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు...
రేవంత్, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి: కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, దేశ ఆర్థికవృద్ధికి ఇంజన్‌లా ఉన్న ఈ రాష్ట్రానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో మొండిచేయి చూపారని బీఆర్‌ఎస్ శాసన సభా పక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది, కాంగ్రె్‌సకు 8 మంది ఎంపీలున్నా ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లినా ఫలితం శూన్యమన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి నిధులు రాబట్టలేకపోవడం వారి అసమర్థతకు నిదర్శనమని అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణకు రూపాయి కూడా కేటాయించని ఈ బడ్జెట్‌పై బీజేపీ నేతలు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.