సిట్ అంటే సీఎం రేవంత్ ఇన్‌స్ట్రక్షన్స్ టీమ్
ABN , Publish Date - Feb 02 , 2026 | 02:42 AM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న సిట్.. స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాదని, అది పూర్తిగా సీఎం రేవంత్‌రెడ్డి ఇన్‌స్ట్రక్షన్స్ టీమ్‌లా మారిపోయిందని బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు.
కేసీఆర్‌కు నోటీసులు కక్షసాధింపు: హరీశ్ రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న సిట్.. స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాదని, అది పూర్తిగా సీఎం రేవంత్‌రెడ్డి ఇన్‌స్ట్రక్షన్స్ టీమ్‌లా మారిపోయిందని బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. విదేశాల్లో ఉండి.. రేవంత్‌రెడ్డి ఫోన్ ద్వారా ఆదేశాలిస్తే.. ఇక్కడ పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని, గజ్వేల్ నుంచి హైదరాబాద్ దాకా వేలాది మంది మోహరించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడం కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపేనని హరీశ్‌రావు ఎక్స్‌లో పేర్కొన్నారు.