ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్ధం ఘటనలో సీఎం హస్తం: హరీశ్
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:36 AM
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మంటలు అంటుకోవడం ప్రమాదం కాదని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఆ కుట్ర జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
మెదక్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మంటలు అంటుకోవడం ప్రమాదం కాదని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఆ కుట్ర జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మెదక్ జిల్లా కేంద్రంతో పాటు, నర్సాపూర్, రామాయంపేటలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని ఏడుపాయల అమ్మవారి మీద ఓట్టు వేసిన రేవంత్.. ఆ మాట తప్పారని, అందుకే మెదక్ రావడానికి మొఖం చెల్లడం లేదని హరీశ్‌రావు విమర్శించారు.