kumaram bheem asifabad- నిషేధిత జాబితా పేరిట సామాన్యులకు ఇబ్బందులు
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:43 PM
నిషేఽధిత జాబితా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా 22ఏలో చేర్చిన భూములను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): నిషేఽధిత జాబితా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా 22ఏలో చేర్చిన భూములను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో రైతుల భూములను హరించే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంలోని 22ఏ కింద నిషేధిత వ్యవసాయ భూములు, 22బి కింద నిషేధిత వ్యవయేతర భూములు నమోదై ఉన్నాయని చెప్పారు. దీంతో భూ యాజమానులు తమ భూములకు సంబందించిన హక్కులను పొందలేక పోతున్నారని వివరించారు. భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రసుగా మారిందని విమర్శించారు. పట్టణాల్లో భూ కబ్జాలకు పాల్పడుతూ పల్లెల్లో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల భూములపై కూడా కన్నేసిందని ఆరోపించారు. అక్రమ వసూళ్ల కోసమే 22ఏ నిబంధనలను తీసుకువచ్చారని విమర్శించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ అర్హులైన రైతుల భూములను పది రోజుల్లోగా నిషేధిత జాబితా నుంచి తొలగించకపోతే ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. అనంతరం నిషేధిత భూముల జాబితాలో ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర భూముల సమస్యలను పరిష్కరించి అర్హులైన భూ యాజమానులకు హక్కులు కల్పించాలని కోరుతూ అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఆకాష్, అహ్మద్, పీఏసీఎస్ ఛైర్మన్ ఆలీబీన్ అహ్మద్, కౌన్సిలర్లు చిలువేరి వెంకటేశ్వర్లు, సాలం, బాలకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు రవిందర్, నాయకులు శ్రీనివాస్, జీవన్, అన్సార్, రవి, ఆహ్మద్, నిసార్, అశోక్, నారయణ, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.