kumaram bheem asifabad- వంతెన పూర్తికాక అవస్థలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 10:20 PM
ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగుపై వంతెన పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి గుండి వాగుపై నిర్మించిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులు, విద్యార్థులు, రైతులు మండల కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగుపై వంతెన పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి గుండి వాగుపై నిర్మించిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులు, విద్యార్థులు, రైతులు మండల కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుండివాగుపై 2007లో రూ. 8.40 కోట్లతో ప్రారంభించిన వంతెన పనులు రెండు దశాబ్దలు గడుస్తున్న పూర్తికాక పోవడంపై గుండి, నందుపా, చోర్‌పల్లి తదితర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మంత్రి సీతక్క ఇక్కడి పనులను పరిశీలించి త్వరలోనే వంతెన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏడాది గడిచిన పరిస్థితి మారకపోవడంతో ఈ వర్షకాలంలోను తమకు రవాణా కష్టాలు తప్పేలా లేవని పరిసర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షకాలం లో వాగులో వరదనీరు ఉధృతంగా ప్రవాహిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొన్నది. జిల్లా కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్లు ఉన్న గుండి గ్రామం వర్షకాలంలో వాగులో వరద ఉధృతి కారణంగా వాంకిడి మీదుగా 25 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికా రులు స్పందించి వంతెన పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వంతెన పనులు పూర్తి చేయాలి..
- జాబరి రవీందర్, సర్పంచ్, గుండి
గుండి వంతెన పనులు వెంటనే పూర్తి చేయాలి. ఎమ్మెల్యే, మంత్రి హామీలు ఇస్తున్నా వంతెన పనులు పూర్తి కావడం లేదు. గుండి నుంచి జిల్లా కేంద్రానికి రావడానికి కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ఉం టుంది. కానీ వర్షకాలంలో వరద ఉధృతి కారణంగా వాంకిడి మీదుగా 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి పరి స్థితి నెలకొంది. వంతెన పూర్తియితే కష్టాలు తీరిపోతాయి.