లబ్ధిదారుల ఆనందం
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:41 PM
సొంత ఇంటి కల నెరవేరడంతో లబ్ధిదారులలో ఎంతో ఆనందం కనిపి స్తోందని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
- పర్యాటక శాఖ మంత్రి జూపల్లి
కోడేరు, నవంబరు 11 (ఆంధ్రజ్యో తి) : సొంత ఇంటి కల నెరవేరడంతో లబ్ధిదారులలో ఎంతో ఆనందం కనిపి స్తోందని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని కోం డ్రావుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నోఏళ్లుగా గూడు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పేద, మధ్య తరగతి కుటుంబాలు సొంత ఇంటి కల కోసం ఎదురు చూసి ఆ కల నెరవేరడంతో ఆ కుటుంబాల్లో ఆనందం వెల్లివి రుస్తోందని అన్నారు. మండలంలో ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత లబ్ధిదారుల ఎంపిక అర్హు లైన వారికి త్వరలోనే పూర్తిచేసి ఇల్లు లేని ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపట్టాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆయన ఆదేశించారు. మన ప్రభుత్వం ప్రతీ ఒ క్కరికి చేరే విధంగా పని చేయాలన్నారు. ఎక్క డ అక్రమాలకు తావు లేకుండా ఉండాలని పారదర్శకంగా సంక్షేమ పథకాలు పేదవారికి అ ర్హులకు అందే విధంగా చూడాలన్నారు. మైలా రం గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మా ణం కోసం భూమి పూజ చేశారు. కార్యక్రమం లో ఎంపీడీవో విజయలక్ష్మి, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్రెడ్డి, సర్పంచు కొమ్మ కురుమయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మురళీరావు, నాయకు లు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.