Share News

హనుమత్‌ సంకల్ప మహా శోభయాత్ర

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:26 PM

పట్టణంలోని ఎస్‌పీఆర్‌ గార్డెన్స్‌లో ఈరామనవమి వేడుకల్లో భాగంగా హనుమత్‌ సంకల్ప శోభాయాత్రను గురు వారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. హనుమాన్‌ స్వాములు, భక్తులచే ముందుగా పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు.

హనుమత్‌ సంకల్ప మహా శోభయాత్ర
లక్షెట్టిపేటలో మహా సంకల్పయాత్ర చేస్తున్న హనుమాన్‌ స్వాములు, భక్తులు

లక్షెట్టిపేట, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎస్‌పీఆర్‌ గార్డెన్స్‌లో ఈరామనవమి వేడుకల్లో భాగంగా హనుమత్‌ సంకల్ప శోభాయాత్రను గురు వారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. హనుమాన్‌ స్వాములు, భక్తులచే ముందుగా పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడారు. అనంతరం హను మాన్‌ చాలీసీ పారాయణం నిర్వహించి స్వాములకు అన్నప్రసాద వితరణ కార్య క్రమం చేపట్టారు. శోభాయాత్రలో స్వాములకు ఎఎంసీ వైస్‌ చైర్మన్‌ ఎండి, ఆరీఫ్‌ పండ్లను అందించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ దొంత అంజలి నర్స య్య, వైస్‌ చైర్మన్‌ రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్‌, ఆర్టీఏ మెంబర్‌ అంకతి శ్రీనివా స్‌తో పాటు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 11:26 PM