kumaram bheem asifabad- భక్తిశ్రద్థలతో హనుమాన్ శోభాయాత్ర
ABN , Publish Date - Mar 29 , 2026 | 10:45 PM
జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయస్వామి ఆలయం నుంచి హనుమాన్ భక్తుల శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ ఉత్సవ విగ్రహానికి ఆలయ ప్రధానార్చకులు శిరీష్ శర్మ, శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయస్వామి ఆలయం నుంచి హనుమాన్ భక్తుల శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ ఉత్సవ విగ్రహానికి ఆలయ ప్రధానార్చకులు శిరీష్ శర్మ, శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్రను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు వెంకేటశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంకన్న, కార్యదర్శి వివేక్, శ్రీనివాస్, రాధాకృష్ణచారి, మురళీధర్‌గౌడ్ నేతృత్వంలో కేస్లాపూర్ మందిరం నుంచి ప్రారం భమైన శోభాయాత్ర జై శ్రీరాం.. జై హనుమాన్ శరణుఘోషతో నృత్యాలు చేస్తూ సాయిబాబా ఆలయం, పొట్టి శ్రీరాములు చౌక్, గాంధీ చౌక్, వివేకానంద చౌక్, అంబేద్కర్ చౌక్ గుండా కొనసాగింది. ఏఎంసీ చైర్ పర్సన్ మంగ, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్, సర్పంచ్ సంగీత, న్యాయవాది రవీం దర్, సతీష్‌బాబు, కౌన్సిలర్లు వెంకన్న, కార్తీక్, బాలాకృష్ణ, నాయకులు బాలేష్‌గౌడ్, డాక్టర్ రమేశ్ పాల్గొన్నారు. శోభాయాత్ర సందర్భంగా సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సైలు కొమురయ్య, కమలాకర్ బందోబస్తు నిర్వహించారు.