Share News

kumaram bheem asifabad- ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 10:30 PM

హనుమాన్‌ జయంతి వేడుకలు గురువారం జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని అయా ఆలయాల్లో ఘనంగా జరిగాయి. పట్టణంలోని పెద్దవాగు నది తీరాన గల కేస్లాపూర్‌ హన్‌మాన్‌ అలయంలో వేద పండితులు శీరిష్‌శర్మ, సంతోష్‌శర్మ ఆధ్వర్యంలో హోమం నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు

kumaram bheem asifabad- ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు
కేస్లాపూర్‌ వీరాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): హనుమాన్‌ జయంతి వేడుకలు గురువారం జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని అయా ఆలయాల్లో ఘనంగా జరిగాయి. పట్టణంలోని పెద్దవాగు నది తీరాన గల కేస్లాపూర్‌ హన్‌మాన్‌ అలయంలో వేద పండితులు శీరిష్‌శర్మ, సంతోష్‌శర్మ ఆధ్వర్యంలో హోమం నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామివారిని జిల్లా కలెక్టర్‌ కె హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్యాంనాయక్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావులతో పాటు ఆయా పార్టీల నాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లిం మైనార్టీ వెల్ఫెర్‌ సొసైటీ అధ్యక్షులు తారీక్‌ అధ్వర్యంలో భక్తులకు తాగునీటిని పంపిణీ చేసి మతసామరస్యనికి ప్రతీకగా నిలిచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఐ బాలజీ వరప్రసాద్‌ అధ్వర్యంలో పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకురాలు సరస్వతి, రాజంపేట సర్పంచ్‌ బుర్స పోచయ్య, ఉప సర్పంచ్‌ లక్ష్మి, అలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, వెంకన్న, వివేక్‌, మధు, లక్ష్మణమూర్తి, రమేష్‌, ఎకిరాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలో వివిధ గ్రామాల్లో గురువారం హనుమాన్‌ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో హింధూ జాగరణ మంచ్‌ ఆధ్వ్యంలో రంగనాయక ఆలయ ప్రాంగణం నుంచి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో కాషాయ, హనుమాన్‌ జెండాలతో శోభాయాత్ర నిర్వహవించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్కపల్లి ఆంజనేయ ఆలయంలో జెండావిష్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

దహెగాం (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా భక్తులు హనుమాన్‌ జయంతిని ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. శివకేశవ ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా హనుమాన్‌ భక్తులు శోభాయాత్ర నిర్వహించారు.. ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేశారు. శివాలయం నుంచి పాత దహెగాం హనుమాన్‌ ఆలయం వరకు శోభాయాత్ర కొనసాగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో హనుమాన్‌ జయంతి వేడుకలను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్‌ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ దండె విఠల్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి చిత్ర పటంతో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ సరిత రాజన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

చింతలమానేపల్లి. (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో హనుమాన్‌ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్‌ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహించారు.

Updated Date - Apr 02 , 2026 | 10:30 PM