kumaram bheem asifabad- చేనేత.. ఏదీ చేయూత?
ABN , Publish Date - Nov 24 , 2026 | 10:54 PM
: చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు తెచ్చిఆ అవి అమలుకు నోచుకోవడం లేదు. భారతీయ సంస్కృతికి ప్రతీక. తరతరాలుగా వస్తున్న వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న నేతన్నలకు నేడు కష్టాలు తప్పటం లేదు. చేతితో నేసిన వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, వాటిని తయారు చేసే కార్మికుల జీవితాల్లో మాత్రం వెలుగులు కన్పించ డం లేదు. చేతితో నేసిన వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, వాటిని తయారు చేసే కార్మికుల జీవితాల్లో మాత్రం వెలుగులు కన్పించటం లేదు.
- ఆర్థిక ఇబ్బందుల్లో నేతన్నలు
కాగజ్‌నగర్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు తెచ్చిఆ అవి అమలుకు నోచుకోవడం లేదు. భారతీయ సంస్కృతికి ప్రతీక. తరతరాలుగా వస్తున్న వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న నేతన్నలకు నేడు కష్టాలు తప్పటం లేదు. చేతితో నేసిన వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, వాటిని తయారు చేసే కార్మికుల జీవితాల్లో మాత్రం వెలుగులు కన్పించ డం లేదు. చేతితో నేసిన వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, వాటిని తయారు చేసే కార్మికుల జీవితాల్లో మాత్రం వెలుగులు కన్పించటం లేదు. ఒక వైపు పెరుగుతున్న ముడిసరుకులు ధరలు, మరో వైపు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక పోవడంతో, ఇంకో వైపు ఆధునిక యంత్రాల పోటీ.. ఇలా అనేక సమస్యలు చేనేత రంగాన్ని వెంటాడుతున్నాయి. దీంతో చేనేత కార్మికులు అవస్థలు పడుతున్నారు.
- వేంపల్లి సమీపంలో..
కాగజ్‌నగర్ వేంపల్లి సమీపంలో చేనేత కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో చేనేత కార్మికులకు కష్టపడి చద్దరి వేస్తే రూ.90 ఇస్తున్నారు. ఇందులో 25 మంది పని చేస్తున్నారు. వరకు కూలీ లభిస్తోంది. ఒక నూలు లడి చుడితే రూ.15 మాత్రమే లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో రెడిమెడ్ దుస్తువులకు గిరాకీ ఎక్కువగా ఉండటంతో చేనేత ఉత్పత్తులకు గిరాకీ లేక ఒక్కసారిగా పడి పోయింది. పవర్‌లూం, మిల్లు పోటీని తట్టుకోవటంతో చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులను గమనించి కేంద్రం చేనతే వస్త్రాలకు గుర్తింపు కోసం కేంద్రం ప్రభుత్వం మార్క్‌ను తయారు చేసింది. చేనేత వస్త్రాలపై ముద్రను వేయాలని నిర్ణయించింది. అయినా ఇంత వరకు ఆచరణలోకి రాలేదు. దీంతో రోజు రోజుకు పడి పోతోంది. ఈ వృత్తిని నమ్ముకొని ఉన్న కార్మికులు వయస్సు మీద పడి పని చేస్తున్నారు. వచ్చిన కూలీ డబ్బులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ వయస్సుతో బయట కూలీ పనులకు పోలేని పరిస్థితి ఉంది. బయటకు కూడా ఉపాధి దొరకని పరిస్థితి ఉండటంతో ఈ వృత్తినే నమ్ముకొని కాలం గడుపుతున్నట్టు పలువురు కూలీలు పేర్కొంటున్నారు. చేనేతలో పని చేస్తున్న నేతన్నలకు ప్రస్తుతం నూలు, రంగులు, ముడిసరుకులను సబ్సిడీపై సకాలంలో అందించాలి. నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర కల్పించాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన ్నబకాయిలు రాయితీలను వెంటనే విడుదలు చేయాలి. చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వ ఆర్డర్లు కేటాయించాలి. అలాగే కార్మికులకు పిల్లలకు విద్యా ప్రొత్సాహకాలు అందించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెల కార్మికులకు రంగాన్ని పొత్సాహించేందుకు నెలకు రూ.2వేల ప్రతి అకౌంటులో జమ చేసే వారని, ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు అమలు చేయటం లేదు. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు.