Share News

ధాన్యం తూకంలో చేతివాటం...!

ABN , Publish Date - May 04 , 2026 | 11:33 PM

ఆరుగాలం శ్రమించి వరి సాగు చేసిన రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. అమ్మ బోతే అడవి...కొనబోతే కొరివి అన్న చందంగా ఎన్నో ఒడిదు డు కులను ఎదురీది పండించిన పంటను అమ్ముకుందామంటే పరిస్థి తులు సహకరించడం లేదు.

 ధాన్యం తూకంలో చేతివాటం...!

-బస్తాకు కిలో అదనంగా పెట్టాలని మిల్లర్ల డిమాండ్‌

-గతంలో బస్తాకు 42 కిలోలతోనే తూకం

-లారీల్లో ధాన్యం దించేందుకూ రూ. 2 అదనం

-కొనుగోలు కేంద్రాల వద్ద ఇష్టారాజ్యం

మంచిర్యాల, మే 5 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించి వరి సాగు చేసిన రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. అమ్మ బోతే అడవి...కొనబోతే కొరివి అన్న చందంగా ఎన్నో ఒడిదు డు కులను ఎదురీది పండించిన పంటను అమ్ముకుందామంటే పరిస్థి తులు సహకరించడం లేదు. ఒక కిలో ఎక్కువ తూకం వేస్తేగానీ కొనేందుకు ససేమిరా అంటున్న మిల్లర్లు, బస్తాకు రూ.2 అదనం గా చెల్లిస్తేగానీ లారీల్లో ధాన్యం దించమని యజమానులు షర తులు విధిస్తుండటంతో రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. అలవిగాని షరతులతో అసలు ధాన్యాన్ని ప్రభుత్వా నికే విక్రయించాలా...? లేదా ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయించి చేతి కి అందింది పుచ్చుకోవాలా...? అన్న మీమాంసలో రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులు పండించిన పంటను పూర్తిస్థాయిలో కొ నుగోలు చేయడం ద్వారా ఇబ్బందులు లేకుండా చేస్తామని ప్ర భుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమేగానీ, ఆచరణలో మాత్రం చేసి చూపకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందు తున్నారు. రైస్‌ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లారీ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అడిగేవారు కరువయ్యారు.

బస్తాకు 43 కిలోల డిమాండ్‌....

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు బస్తాకు 42 కిలోలు మాత్రమే తూకం వేసేవారు. వాస్తవానికి బస్తాకు 40 కిలోల ధాన్యం మాత్రమే తూగుతుంది. ధాన్యంలో తాలు, తప్ప ఉండే అవకాశం ఉంది గనుక రైస్‌ మిల్లర్లు రెండు కిలోలు అదనంగా తూకం వేసేవారు. దీనికి రైతులు కూడా సమ్మతి తెలిపేవారు. అందుకు భిన్నంగా ఈ సారి మిల్లర్లు బస్తాకు 43 కిలోలు తూకం వేయాల్సిందేనని పట్టుబడతున్నారు. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో ఒక లక్షా 18 వేల 437 ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇందులో దొడ్డు రకం ఒక లక్షా 16వేల 768 ఎకరాలు కాగా, సన్నరకం 1669 ఎకరాలు ఉంది. సీజన్‌లో 2లక్షల 95వేల 759 మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేస్తుండగా, ఇందులో దొడ్డు రకం 2 లక్షల 91వేల 920 మెట్రిక్‌ టన్నులు, సన్నరకం ధాన్యం 3839 మెట్రిక్‌ టన్నులు ఉంటుందని భావిస్తు న్నారు. దిగుబడి అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీఏ, పీఏసీఎస్‌, మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 319 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు లక్ష్యం గా పెట్టుకోగా, వాటిలో ఇటీవల పలు చోట్ల సెంటర్లు ప్రారంభం అయ్యాయి. అయితే కొనుగోలు కేంద్రాల్లో గతంలో మాదిరి కాకుం డా మిల్లర్లు బస్తాకు కిలో అదనంగా తూకం వేస్తున్నారు. తాలు, తప్ప పేరుతో ఇప్పటికే తాము రెండు కిలోల ధాన్యం వదిలి వేస్తు న్నామని, ఈ యేడు అదనంగా మరో కిలో డిమాండ్‌ చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. కేంద్రం నిర్ణయించిన ఎంఎస్‌పీ (మిని మం సపోర్ట్‌ ప్రైస్‌) ప్రకారం కిలో వరి ధాన్యం విలువ రూ. 23 పై చిలుకు ఉంటుందని, ఒక్కో రైతు సగటున వంద క్వింటాళ్ల వరకు విక్రయిస్తే రైస్‌ మిల్లర్ల వైఖరి కారణంగా అతనికి ఏకంగా రూ. 23వేల వరకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన చెందుతున్నారు.

బస్తాకు రూ. 2 అదనపు చార్జీ వసూలు....

ఓ వైపు రైస్‌ మిల్లర్లు బస్తాకు కిలో అదనంగా రైతుల నుంచి బాదుతుండగా, మరోవైపు లారీల యజమానులు సైతం తమ చే తివాటం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కాంటా వేసి, దాన్ని లారీల్లో లోడ్‌ చేసినందుకు రైతులు క్వింటాలుకు రూ. 60 చొప్పున చెల్లించేవారు. ఈ పద్ధతి గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతోంది. దీనికి భిన్నంగా లారీల యజమా నులు ఏ ఏడాది కొత్త మెలిక పెడుతున్నట్లు రైతులు వాపోతు న్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద లోడ్‌ చేసిన ధాన్యాన్ని రైస్‌ మి ల్లుల వద్ద దించేందుకు బస్తాకు రూ. 2 హమాలీ చార్జీలు చె ల్లించాలని లారీల యజమానులు పట్టుబడుతున్నట్లు చెబుతు న్నారు. గతంలో క్వింటాకు రూ. 60 చెల్లిస్తే ధాన్యం కాంటా, లారీ లో లోడింగ్‌తో పాటు రైస్‌ మిల్లుల్లో దించేవారని, ప్రస్తుతం బ స్తాకు రూ. 2 అదనంగా డిమాండ్‌ చేస్తున్నారని ఆవేదన చెందు తున్నారు. ఒక క్వింటాలు ధాన్యం రెండున్నర బస్తాలు తూగుతుం దని, అలా క్వింటా పేరిట రూ. 5 అక్రమంగా వసూలు చేస్తున్నా రని వాపోతున్నారు. ఈ తతంగంపై సంబంధిత అధికారులు, ప్ర జా ప్రతినిధులు దృష్టిసారించడం ద్వారా అక్రమ వసూళ్లను అరి కట్టాలని రైతులు వేడుకుంటున్నారు.

పాత పద్ధతి ప్రకారమే కొనుగోళ్లు చేపట్టాలి....

లగిశెట్టి రాజమౌళి, గుడిపేట

వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పాత పద్ధతినే అమలు చేయాలి. గతంలో బస్తాకు 42 కిలోలు తూకం వేసేవారు. ప్రస్తు తం కిలో అదనంగా డిమాండ్‌ చేయడం సమంజసంకాదు. అలాగే బస్తాలను రైస్‌ మిల్లుల వద్ద దించేందుకు ఒక్కొక్కంటికి రూ.2 చొప్పున లారీల యజమానులు వసూలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల వద్ద అదనపు వసూళ్లకు పాల్పడ టం పద్ధతికాదు. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఈ సమస్యపట్ల ధృష్టిసారించాలి.

Updated Date - May 04 , 2026 | 11:33 PM