Share News

kumaram bheem asifabad- సగం మంది బడిలో.. సగం మంది ఇంట్లో..

ABN , Publish Date - Mar 27 , 2026 | 10:42 PM

వార్షిక పరీక్షల మధ్య విరామంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వ హించే ప్రత్యేక తరగతులకు సగం మంది మాత్రమే హాజరవుతున్నారు. ప్రతి విద్యార్థికి పదో తరగతి కీల కం. భవితను నిర్దేశించేది కావడంతో ఉత్తమ మా ర్కులతో ఉత్తీర్ణులు కావాలని తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు ఆశిస్తుంటారు. ఈ నెల 14న పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 16 వరకు కొనసాగ నున్నాయి

kumaram bheem asifabad- సగం మంది బడిలో.. సగం మంది ఇంట్లో..
ఖిరిడి పాఠశాలలో హాజరైన విద్యార్థులు

వాంకిడి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): వార్షిక పరీక్షల మధ్య విరామంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వ హించే ప్రత్యేక తరగతులకు సగం మంది మాత్రమే హాజరవుతున్నారు. ప్రతి విద్యార్థికి పదో తరగతి కీల కం. భవితను నిర్దేశించేది కావడంతో ఉత్తమ మా ర్కులతో ఉత్తీర్ణులు కావాలని తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు ఆశిస్తుంటారు. ఈ నెల 14న పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 16 వరకు కొనసాగ నున్నాయి. ఒక్కో పరీక్షకు మూడు, నాలుగు రోజుల వ్యవధి ఉంది. దీంతో విద్యార్థులు ఇంటిపట్టున కూర్చొని చదవలేరన్న ఉద్దేశంతో పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణకు విద్యాశాఖ ఆదేశించింది. కానీ జిల్లలో చాలా చోట్ల విద్యార్థులు సరిగా హాజరు కావడంలేదు. ఇప్పటి వరకు మూడు సబ్జెక్టులు పూర్త య్యాయి. 28న గణితం, ఏప్రిల్‌ 2న ఫిజికల్‌ సైన్స్‌, 7న బయోసైన్స్‌, 13న సాంఘిక శాస్త్రం పరీక్షలు ఉన్నాయి. ప్రతీ పరీక్షకు మూడు, నాలుగు రోజుల వ్యవధి ఉంది. పరీక్షలేని రోజుల్లో పాఠశాలకు హాజరైతే ఉపాధ్యాయు ల పర్యవేక్షణలో చదువుకునే వీలుంటుంది. ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది.

- 6,949 మంది విద్యార్థులు..

జిల్లాలో అన్ని యాజమాన్యల పరిధిలోని పాఠశా లలకు చెందిన 6,949 మంది విద్యార్థులు వార్షీక పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల, తెలంగాణ ఆదర్శ పాఠశాలల విద్యార్థులు 2,700 మంది ఉన్నారు. ఆశ్రమ, కస్తూర్బా, గురు కులాల విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉంటు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఉన్నత పాఠశా లల్లో చదువుకుంటున్న కొంత మంది విద్యార్థులు మండల కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాలకు చెందిన వారు కావడంతో ప్రత్యేక తరగతులకు హాజరుకావడంలేదు. పాఠశాలల ప్రధానోపాధ్యాయు లు, సంబందిత సబ్జెక్టుల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పిల్లలను పంపించాలని సూచిస్తున్నారు.

దృష్టి సారించాం..

శివచరణ్‌కుమార్‌, ఎంఈవో

విద్యార్థుల హాజరుపై దృష్టి సారించాం. ప్రభుత్వం సదుద్దేశంతో పరీక్షల మధ్య విరామాన్ని ఇచ్చింది. ఈ విధానం విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగప డుతుంది. హాజరు కానీవారి తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వచ్చేలా దృష్టి సారించాలని ఆయా ఉన్నత పాఠ శాలల ప్రధానోపాధ్యాయులకు, సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులను ఆదేశించాం.

Updated Date - Mar 27 , 2026 | 10:42 PM