ధర్మపురి విద్యావికాసానికి ‘హిందుస్థాన్’ ఊతం
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:56 AM
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నత విద్యా విస్తరణకు కీలక అడుగు పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను...
రూ.10 కోట్లతో నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణం
మంత్రి అడ్లూరి సమక్షంలో అవగాహన ఒప్పందం
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నత విద్యా విస్తరణకు కీలక అడుగు పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో, ధర్మపురిలో రూ.10 కోట్ల వ్యయంతో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‘ (హెచ్‌ఏఎల్) ముందుకు వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో బుధవారం సచివాలయంలో హెచ్‌ఏఎల్ ప్రతినిధులు, జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, హెచ్‌ఏఎల్ హైదరాబాద్ చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎ.వి.మురళీకృష్ణ తదితరులు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అన్ని ఆధునిక వసతులతో ఈ భవనాన్ని నిర్మిస్తామని మంత్రి అడ్లూరి తెలిపారు.