Share News

హకీంపేట క్రీడా పాఠశాలలో ప్రవేశాలు

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:55 AM

రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని హకీంపేట్‌లో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలలో.. 2026-27 విద్యాసంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశం కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది.

హకీంపేట క్రీడా పాఠశాలలో ప్రవేశాలు

  • 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని హకీంపేట్‌లో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలలో.. 2026-27 విద్యాసంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశం కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 9 రకాల శరీర దారుఢ్య పరీక్షలతో పాటు వైద్య పరీక్షలు పరీక్షలు నిర్వహిస్తారని స్పోర్ట్స్‌ అథారిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోనిబాల దేవి చెప్పారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు(బాలురు) 01.09.2017 నుంచి 31.08.2018 మధ్యలో జన్మించి ఉండాలన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 26 నుంచి మార్చి 4 వరకు https://tgss.telangana. gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Updated Date - Feb 12 , 2026 | 12:55 AM