kumaram bheem asifabad- జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి
ABN , Publish Date - Oct 07 , 2026 | 10:41 PM
ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే మెంగాజీ డిమాండ్ చేశారు. దేశంలో ఓటుహక్కు, ఎన్నికల పారదర్శకత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు బైక్‌ర్యాలీ నిర్వహించారు.
వాంకిడి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే మెంగాజీ డిమాండ్ చేశారు. దేశంలో ఓటుహక్కు, ఎన్నికల పారదర్శకత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్నులే మెంగాజీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి ఓటు ఎంతో విలువైనదని ఒక్క ఓటు కూడా అన్యాయంగా తొలగించకూదని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంబార సర్పంచ్ కృష్ణాజీ, వాంకిడి ఉపసర్పంచ్ దీపక్‌ముండే, ఉపాధ్యక్షుడు సెల్వట్‌కార్ పెంటు, నాయకులు మారుతీ, రమేష్, ధన్‌వల్‌కార్ కమలేష్, జాబిరే గణేష్, ఉప్పుల కృష్ణ, దుర్గం హంసరాజ్, విలాస్, శివాజీ, సీపీఐ నాయకుడు గోపినాథ్, తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కెరమెరిలో బుధవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుజాయిత్ ఖాన్ మాట్లాడుతూ ఓటు హక్కును, ప్రజా స్వామ్య వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారితనం ఉండాలన్నారు. ఎన్నికల సంఘం పని తీరు పట్ల ప్రజల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని తెలిపారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిర ఫెలోషిప్ జిల్లా అధ్యక్షురాలు కోవ ఇందిర, డీసీసీ కార్యదర్శి రాథోడ్ శంకర్, విమలబాయితో పాటు కార్పెత విమలబాయి, రాథోడ్ పుష్పలత, రాధోడ్ శంకర్, బలవంత్ తదితరులు పాల్గొన్నారు.