kumaram bheem asifabad-ఈదురుగాలులు.. వర్షం
ABN , Publish Date - Apr 05 , 2026 | 10:32 PM
: జిల్లాలోని బెజ్జూరు, కెరమెరి మండలాల్లో ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బెజ్జూరు మండలంలో ఈదురుగాలులకు పలు గ్రామాల్లో పలువురు ఇళ్లపై కప్పు రేకులు గాలికి లేచి పోయాయి., మండలంలోని అందుగులగూడ, కుంటలమానేపల్లి, ఊట్‌పల్లి తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఆయా గ్రామాల్లోని పలువురు ఇళ్లలోని పై కప్పు రేకులు గాలికి లేచి పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
బెజ్జూరు/కెరమెరి, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని బెజ్జూరు, కెరమెరి మండలాల్లో ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బెజ్జూరు మండలంలో ఈదురుగాలులకు పలు గ్రామాల్లో పలువురు ఇళ్లపై కప్పు రేకులు గాలికి లేచి పోయాయి., మండలంలోని అందుగులగూడ, కుంటలమానేపల్లి, ఊట్‌పల్లి తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఆయా గ్రామాల్లోని పలువురు ఇళ్లలోని పై కప్పు రేకులు గాలికి లేచి పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒక్క సారిగా ఈదురుగాలులు తీవ్రంగా రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈదురుగాలుల వర్షానినికి తీవ్రంగా నష్ట పోయామని అధికారులు స్పందించి పరిహారం ఇవ్వాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కెరమెరి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ఆదివారం తెల్లవారు జామున కురిసింది. గోయగాంగ్రామ పంచాయతీ పిప్రి గ్రామానికి చెందిన కోలాంల గిరి.జనులు 2024లో నిర్మించిన ఇళ్ల పైకప్పలు పూర్తిగా ఈదురుగాలులకు ధ్వంసమయ్యాయి. పిప్రి గ్రామానికి చెందిన మడావి పావుగా, ఆత్రం పగ్గుల ఇళ్లు పూర్తిగా లేచి పోయాయి. ఐటీడీఏ అధికారులు గ్రామాన్ని సందర్శించి ఇళ్లకు మరమ్మతులు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. దెబ్బఇతన్న ఇళ్లను సర్పంచ్ ఆనంద్‌రావు, ఉప సర్పంచ్ రాందాస్, కార్యదర్శి మురళీధర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.