Share News

kumaram bheem asifabad- ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ABN , Publish Date - Jul 29 , 2026 | 10:57 PM

జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ురుపౌర్ణమి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ఆలయ ప్రదానఅర్చకులు మధుకర్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

kumaram bheem asifabad- ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

- ఏర్పాట్లు చేసిన ఆలయాల కమిటీ సభ్యులు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ురుపౌర్ణమి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ఆలయ ప్రదానఅర్చకులు మధుకర్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో డీసీసీ అద్యక్షురాలు సుగుణ, ప్రధాన కార్యదర్శి చిన్నమల్లన్న, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ, బీజేపీ నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంతో పాటు వాంకిడి, కెరమెరి, రెబ్బెన మండలాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కాగజ్‌నగర్‌/కౌటాల/రెబ్బెన/చింతలమానేపల్లి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణంలో బుధవారం గురుపూజోత్సవ వేడుకలు స్థానిక సాయిమందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ మాట్లాడుతూ గురువుల ఆశీస్సులు సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. ఆధ్యాత్మీకత మనిషిలో సేవా భావాన్ని, నైతిక విలువలను పెంపొందిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీని ఆలయ కమిటి సభ్యులు ఘనంగా సన్మానించారు. కౌటాలలో కూడా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేపట్టారు. అలాగే రెబ్బెనలో అంగన్వాడి ఉపాధ్యాయురాలు చంద్రకళను లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ గోలేటి స్పోర్ట్స్‌ అద్యక్షులు సంజీవ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ అద్యక్షుడు గురువుల ఆవశ్యకతను వివరించారు.పెంచికల్‌పేటలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఈవో రమేష్‌ బాబు మాట్లాడుతూ అజ్ఙానం నుంచి జ్ణాన మార్గంలో నడిపించే వారే గురవన్నారు. రిటైర్డ్‌ అయిన ఉపాధ్యాయుడిని సన్మానించారు. చింతలమానేపల్లిలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో పాఠశాల కరస్పాండెంట్‌ విజయ్‌ కుమారి, డైరెక్టర్‌ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): పరమ హంస సద్గురు పులాజీబాబా అందించిన అధ్యాత్మిక హితబోధనలే తనను పాట్నాపూర్‌ సిద్దేశ్వర్‌ సంస్థాన్‌కు తీసుకొచ్చాయని పంజాబ్‌కు చెందిన బిఎస్‌ఎన్‌ఎల్‌ అధికారి ఎక్బాల్‌సింగ్‌ తెలిపారు. కుంరంభీం జిల్లా పరిధిలోగల జైనూర్‌ మండలంలోని పాట్నాపూర్‌లో బుధవారం అంగ రంగ వైభంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్బాల్‌సింగ్‌ ముఖ్య ఆతిథిగా హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో నాందేడ్‌కు చెందిన మహేందర్‌సింగ్‌, బాబా తనయులు ఇంగ్లే కేశవ్‌రావ్‌, ఇంగ్లే వామన్‌రావ్‌, ఆసిఫాబాద్‌ నియోజక వర్గం కాంగ్రుస్‌ పార్టీ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్‌ , ఉమ్మర్‌ఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే ఉత్తంరావ్‌ ఇంగ్లే, సర్పంచ్‌ కందారె బాలాజీ లక్ష్మీబాయి, కమిటి సభ్యులు డుక్రె సుభాష్‌, మాగాడె దాదారావ్‌, జనార్ధన్‌, రంగారావ్‌, హన్మంత్‌రావ్‌, సీఐ రమేష్‌, ఎస్‌ఐ రవికుమార్‌, భక్తులు పాల్గొన్నారు. స్థానిక హనుమాన్‌ మందిర ప్రాంగణంలో బుధవారం స్వాధ్యాయ పరివారం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు.

బెజ్జూరు,(ఆంధ్రజ్యోతి): మండలంలోని వివిద పాఠశాలలు, ఆలయాల్లో బుదవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గురుపౌర్ణమి సందర్బంగా పాఠశాలల్లోని గురువులను విద్యార్థులు సన్మానించారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మహగాంలో గల గురుదేవ్‌ సేవ ఆశ్రమంలో బుధవారం గురుపూర్ణిమ వేడుకలు వైభవంగా నిర్వహించారు.గురుదేవ్‌ సేవ ఆశ్రమం పీఠాధిపతి మెస్రం కైలాష్‌ మహారాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సురోజీ మహారాజ్‌ భక్తులు ప్రత్యేక పూజలు, గురువందనం , భజనలు నిర్వహించి గురువును స్మరించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచులు సేడ్మకి జానేరావు, మెస్రం స్పందన, మాజీ సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2026 | 10:57 PM