గుర్రంగూడ ప్రాంతం.. రిజర్వ్ ఫారెస్ట్
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:43 AM
హైదరాబాద్ శివారులోని గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ ఫారె్‌స్టగా ప్రకటించింది. ఈ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా న్యాయవివాదాల్లో ఉండగా..
ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారులోని గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ ఫారె్‌స్టగా ప్రకటించింది. ఈ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా న్యాయవివాదాల్లో ఉండగా.. ఆమన్‌గల్ డివిజన్ పరిధి గుర్రంగూడలోని 424 ఎకరాలు 31 గుంటల్లో ఉన్న అటవీ భూమికి ప్రభుత్వం రిజర్వ్ హోదా కల్పించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ అటవీ చట్టం-1967లోని సెక్షన్ 15 ప్రకారం పర్యావరణ, అటవీ శాఖ మార్చి 9న జీవో జారీ చేసింది. దీంతో కొన్నేళ్లుగా న్యాయవివాదాల్లో ఉన్న సాహెబ్‌నగర్ కలాన్ భూములపై ప్రభుత్వ హక్కులకు బలం చేకూరింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల ఆ అటవీ భూములకు మరింత బలమైన చట్టపరమైన రక్షణ లభించనుందని అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి సి.సువర్ణ తెలిపారు.