భక్తులతో పోటెత్తిన గూడెం ఆలయం
ABN , Publish Date - Nov 22 , 2026 | 10:21 PM
కార్తీక శుద్ద త్రయోదశి పురస్కరించుకొని దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి జాతర ఉత్సావాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవా చన ము, అంకురారోపణము, ఆగ్నిప్రతిష్ట, నిత్యహవనములు, బలిహరణము ప్రత్యే క పూజ కార్యక్రమాలను ఆలయ ముఖ్య అర్చకులు గోవర్ధన రఘస్వామి, వ్యవ స్థాపక కుటుంబ సభ్యులు అర్చకులు సంపత్‌స్వామి, వేదపండితులు అభిరామ చార్యులు, అర్చకుల సమక్ష్యంలో నిర్వహించారు.
వైభవంగా ప్రారంభమైన కార్తీక ఉత్సవాలు
దండేపల్లి నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కార్తీక శుద్ద త్రయోదశి పురస్కరించుకొని దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి జాతర ఉత్సావాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవా చన ము, అంకురారోపణము, ఆగ్నిప్రతిష్ట, నిత్యహవనములు, బలిహరణము ప్రత్యే క పూజ కార్యక్రమాలను ఆలయ ముఖ్య అర్చకులు గోవర్ధన రఘస్వామి, వ్యవ స్థాపక కుటుంబ సభ్యులు అర్చకులు సంపత్‌స్వామి, వేదపండితులు అభిరామ చార్యులు, అర్చకుల సమక్ష్యంలో నిర్వహించారు. ఆదివారం సెలవు దినంకావ డంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే సుమారు వేలాది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ముందుగా పవిత్ర గోదావరి న దిలో కార్తీక పుణ్య స్నానాలు ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశా రు. గోదావరి నదిలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అ నంతరం ఆలయానికి చేరుకొని భక్తులు కుటుంబసమేతంగా కార్తీక ప్రత్యేక పూ జలు చేశారు. ఆలయం ప్రాంగణంలో ధ్వజస్తంభం, రావిచెట్టు వద్ద ఉసిరి కా యమీద కార్తీక దీపాలు వెలిగించగా, 108, 116, 121 361 వత్తులతో కార్తీక దీపాలను వెలగించి కార్తీక పూజలు చేశారు. ఆలయంలో 500 పైగా భక్తులు కుటుంబసమేతంగా శ్రీసత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలను అచరిం చి ప్రత్యేక పూజలు గావించారు. మరికొందరు మహిళ భక్తులు వేదపండితులు అర్చకులకు కార్తీక దీపాలను దానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీం తో గూడెం ఆలయ పరిసర ప్రాంతమంతా కార్తీక శోభ సంతరించుకుంది.