Share News

kumaram bheem asifabad- పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌

ABN , Publish Date - Mar 10 , 2026 | 10:56 PM

జిల్లాలో గత కొన్ని రోజులుగా విద్యుత్‌ వినియోగం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. జిల్లాలో విద్యు త్‌ డిమాండ్‌ కూడ రికార్డు స్థాయికి చేరుకుంది. ఈనెల 2వ తేదీన అత్యధికంగా రికార్డు స్థాయిలో 1.735 మీలియన్‌ యూనిట్ల డిమాండ్‌ నమోదైందని అదికారులు వెల్లడించారు. అయితే పెరుగుతున్న వినియోగం ఉన్నప్పటికీ జిల్లాలో ఎలాంటి అంతరా యాలు లేకుండా విద్యుత్‌ సరఫరా కొనసాగిస్తున్నా మని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు.

kumaram bheem asifabad- పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌
లోగో

- వేసవి ప్రారంభంలోనే తీవ్రమైన ఎండలు

- మార్చిలోనే తీవ్రమైన ఉక్కపోత

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత కొన్ని రోజులుగా విద్యుత్‌ వినియోగం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. జిల్లాలో విద్యు త్‌ డిమాండ్‌ కూడ రికార్డు స్థాయికి చేరుకుంది. ఈనెల 2వ తేదీన అత్యధికంగా రికార్డు స్థాయిలో 1.735 మీలియన్‌ యూనిట్ల డిమాండ్‌ నమోదైందని అదికారులు వెల్లడించారు. అయితే పెరుగుతున్న వినియోగం ఉన్నప్పటికీ జిల్లాలో ఎలాంటి అంతరా యాలు లేకుండా విద్యుత్‌ సరఫరా కొనసాగిస్తున్నా మని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ లైన్లు ఏర్పాటు చేయడం కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించడం, ఫీడర్ల విభజన చేయడం, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడం వంటి చర్యలతో నిరంతర విద్యుత్‌ సరఫరా అందించగలు గుతున్నామని చెబుతున్నారు. వాతావరణంలో మా ర్పులు రావడంతో విదు ్యత్‌ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌శాఖ సిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తున్నారని తెలిపారు. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఎదురె ౖనా 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌కు లేదా ఏఈలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

జిల్లాలో 1,77,479 విద్యుత్‌ కనెక్షన్లు:

జిల్లాలో 1,77,479 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 1,41,942 గృహ, 15,004 వాణిజ్య, 633 పరిశ్రమలు, 15,258 వ్యవసాయ కనెక్షన్లతో పాటు వివిధ రకాల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజు 17.35 లక్షల యూనిట్ల వినియోగం కాగా ప్రభుత్వా నికి రూ కోటి ఆదాయం సమకూరుతుంది. జిల్లాలో ని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, కౌటాలలో 132/33 కేవీ సబ్‌ స్టేషన్లు ఉండగా, 33/11 సబ్‌స్టేషన్లు 34 ఉన్నాయి.

- ఉక్కపోత నుంచి..

రోజురోజుకు ఎండ తీవ్రత అధికమవుతుండడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ప్రజలు కూలర్లు, ఏసీల వాడకం ప్రారంభించారు. అలాగే అవసరాకలు అనుగుణంగా ప్రతి ఇంట్లో విద్యుత్‌ గృహోపకరణాల వినియోగం పెరిగింది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం ఎక్కువ కావడంతో గ్రీడ్‌పై ఒత్తిడి పెరుగుతొంది. అలాగే జిల్లాలో యాసంగి సాగు గతంతో పోల్చితే గణనీయంగా పెరిగింది. ఆసిఫాబాద్‌ మండలంంలోని కుమరంభీం, వట్టివాగు ప్రాజెక్టుల నుంచి అయకట్టుకు అవసరమైన సాగునీరందక రైతులు రాత్రిపూట బోర్లు అధికంగా వినియోగిస్తున్నారు.

- జాగ్రత్తలు పాటించాలి..

జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. వేసవిలో డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. వినియోగం నియంత్రించేందుకు ప్రతీ ఇంట్లోను ఎల్‌ఈడీ బల్బులు వాడాలని అధికారులు సూచిసు ్తన్నారు. ఇన్వర్టర్‌ గృహలకు తక్కువ వాట్స్‌ విద్యుత్‌ సాధనాలు ఉపయోగించాలి. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, ఏసీలు, వాటర్‌ హీటర్లు, టీవీలు ఆఫ్‌ చేయ డం, రాత్రి సమయంలో వినియోగం తగ్గించాలి. రైతులు వ్యవసాయ పంపుసెట్లను ఉదయం లేదా మధ్యాహ్నం వేళల్లో వినియోగించుకోవాలి.

ఇటీవల నమోదైన విద్యుత్‌ వినియోగ గణాంకాలు ఇలా..

తేది వినియోగం(మిలియన్‌ యూనిట్లు)

01 1.699

02 1.735

03 1.685

04 1.688

05 1.719

06 1.581

07 1.585

08 1.616

09 1.584

డిమాండ్‌కు తగినట్లుగా..

- ఉత్తం జాడే, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ, ఆసిఫాబాద్‌

విద్యుత్‌ డిమాండ్‌కు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇటీవల ఉష్ణోగ్రతలు పెరగడం, గృహ వినియోగం అధికమవడం, వ్యవసాయ అవసరాలు పెరగడం వంటి కారణాల వల్ల విద్యుత్‌ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. పెరుగుతున్న డిమాం డ్‌ను దృష్టిలో ఉంచుకొని ఫీడర్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైనప్పుడు లోడ్‌ మేనేజ్‌మెంట్‌ చర్యలు కూ డా చేపట్టేందుకు సిద్థంగా ఉన్నాం. జిల్లాలో 14 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు కాగా ఇప్పటి వరకు ఏడు బిగించాం.

Updated Date - Mar 10 , 2026 | 10:56 PM