Share News

Group 1 Officers: రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీ్‌సను ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:42 AM

జాతీయ స్థాయిలో ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీ్‌స(ఐఏఎస్‌) ఉన్నట్లుగానే.. రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీ్‌స(టీఏఎ్‌స)ను ఏర్పాటు చేయాలని తెలంగాణ....

Group 1 Officers: రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీ్‌సను ఏర్పాటు చేయండి

  • రేవంత్‌రెడ్డికి గ్రూప్‌-1 అధికారుల సంఘం విజ్ఞప్తి

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో ‘ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీ్‌స(ఐఏఎస్‌) ఉన్నట్లుగానే.. రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీ్‌స(టీఏఎ్‌స)ను ఏర్పాటు చేయాలని తెలంగాణ గ్రూప్‌-1 అధికారుల సంఘం సీఎం రేవంత్‌రెడ్డిని కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌, హన్మంత్‌ నాయక్‌ల ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో అనుభవం గల గ్రూప్‌-1 అధికారులతో టీఏఎ్‌సను ఏర్పాటు చేయాలని కోరారు. టీఏఎస్‌ ఏర్పాటైతే పంచాయతీరాజ్‌, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేసే చాలా మంది గ్రూప్‌-1 అధికారులకు కార్పొరేషన్ల ఎండీలు వంటి కీలక పోస్టులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. స్టేట్‌ సివిల్‌ సర్వీ్‌స(ఎ్‌ససీఎస్‌) పరిధిలోకి అన్ని గ్రూప్‌-1 పోస్టులను తీసుకురావాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో గ్రూప్‌-1 అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారని అధికారులు తెలిపారు.

Updated Date - Jan 09 , 2026 | 04:42 AM