గ్రూపు రాజకీయాలు వీడాలి
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:23 PM
గ్రూపు రాజకీ యాలు వీడి అభివృద్ధిలో భాగ స్వాములు కావాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కార్య కర్తలకు పిలుపనిచ్చారు.
- అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
అచ్చంపేట, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : గ్రూపు రాజకీ యాలు వీడి అభివృద్ధిలో భాగ స్వాములు కావాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కార్య కర్తలకు పిలుపనిచ్చారు. లింగా ల మండలం అవుసలికుంట గ్రా మంలో బుధవారం రంగినేని శ్రీ నివాస్‌రావు నివాసంలో మండల ముఖ్య కార్య కర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్త లకు ఏ చిన్న ఆపద వచ్చినా మీకు అండగా తాను ఉంటానని భరోసాఇచ్చారు. మనలో మనకు విభేదాలు వద్దని, గ్రూపు రాజకీయాలు చేయ డం వల్ల మూడో వ్యక్తికి లాభం చేకూర్చిన వార మవుతామన్నారు. కార్యక్రమంలో నూతన సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
లింగాల మండలం సూరాపూర్ గ్రామంలో బుధవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ, టీపీసీసీ సీనియర్ నాయకుడు రంగినేని శ్రీనివాస్‌రావుతో కలిసి పలుఅభివృద్ధి కార్యక్ర మాలకు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. సూరాపూర్‌లో నూతనంగా బస్‌షెల్టర్ నిర్మాణా నికి భూమి పూజ చేశారు. పనులను త్వరితగ తిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించా రు. అదేవిధంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశా లను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీ లించారు. గ్రామంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కొత్త నాగేశ్వర్‌రావు, సర్పంచ్ శేఖర్, డిప్యూటీ సర్పంచ్ రవి, వెం కటేశ్, తిరుపతయ్య పాల్గొన్నారు.
రైతులకు స్ర్పింక్లర్లు పంపిణీ
అమ్రాబాద్, (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బీకేతిర్మలాపూర్, బీకే ఉప్పునుంతల గ్రామాలకు చెందిన 60మంది వాటర్‌షెడ్ రైతులకు రూ.23 లక్షల విలువ చేసే స్ర్పింక్లర్ల సెట్స్, టార్పాలిన్ కవర్లు, తైవాన్ పంపులను అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ బుధవారం అచ్చంపేట ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతోపాటుఅచ్చంపేట డివిజన్ వాటర్ షెడ్ అధికారి కాశన్న, వాటర్ షెడ్ కమిటీ సభ్యులు చెన్నకేశవులు, శ్యాంసుందర్, హను మంతు, సాయిలు, చంద్రయ్య పాల్గొన్నారు.