Share News

కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ

ABN , Publish Date - Jun 30 , 2026 | 11:28 PM

అమ్రాబాద్‌ మండలం మన్ననూరు గ్రామం లో రూ.10 లక్షలతో మంజూరైన మైనార్టీ కమ్యూనిటీ భవన పను లకు ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ మంగళవారం భూమి పూజ చే శారు.

కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ
కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

మన్ననూర్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : అమ్రాబాద్‌ మండలం మన్ననూరు గ్రామం లో రూ.10 లక్షలతో మంజూరైన మైనార్టీ కమ్యూనిటీ భవన పను లకు ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ మంగళవారం భూమి పూజ చే శారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభు త్వంకృషి చేస్తోందన్నారు. తూర్పు పొడజాతి ఆవుల పునరుత్పత్తి కేం ద్రాన్ని మంజూరు చేయిస్తానని, కృష్ణా నదిపై మద్దిమడుగు మాచర్ల అంతర్రాష్ట్ర వంతెన ని ర్మాణం, అమ్రాబాద్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు రాబోయే రోజుల్లో శ్రీకారం చుట్టనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్‌ పో షం గణేశ్‌, గ్రామ సర్పంచు మంజుల, ఉమా మహేశ్వర పాలకమండలి డైరెక్టర్‌ సంభు శోభ, మసీదు కమిటీ అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్‌, కాంగ్రెస్‌ పార్టీ మండలఅధ్యక్షుడు ఎంఏ రహీం, మాజీ ఎంపీటీసీ దాసరి శ్రీనివాసులు, మైనార్టీ నాయకులు షకీల్‌, జాకీర్‌ షరీఫ్‌, రహి మాన్‌, ఖాజ, రవూఫ్‌, బాబా, కాంగ్రెస్‌ నాయకులు రా జారాం నాయక్‌, సంభు వెంకట్‌రమణ, హన్మం త్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌, గోపాల్‌రెడ్డి, శ్రీను, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 11:28 PM