Share News

సాగర్‌ను సందర్శించిన జీఆర్‌ఎంబీ చైర్మన్‌

ABN , Publish Date - May 29 , 2026 | 03:41 AM

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ జలాశయాన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌ (జీఆర్‌ఎంబీ) పి.దోర్జీగ్యాంబా గురువారం పరిశీలించారు.

సాగర్‌ను సందర్శించిన జీఆర్‌ఎంబీ చైర్మన్‌

నాగార్జునసాగర్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ జలాశయాన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌ (జీఆర్‌ఎంబీ) పి.దోర్జీగ్యాంబా గురువారం పరిశీలించారు. ఉదయం 10 గంటలకు సాగర్‌కు చేరుకున్న ఆయనకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఎస్‌ఈలు మల్లికార్జున్‌రావు, వెంకటరత్నం ఘనస్వాగతం పలికారు. విజయవిహార్‌ అతిథి గృహంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం అనంతరం ప్రధాన డ్యామ్‌, క్రస్ట్‌ గేట్లు, స్పిల్‌వే, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను, ప్రధాన జల విద్యుత్‌ కేంద్రాలను జీఆర్‌ఎంబీ చైర్మన్‌ పరిశీలించారు. వరద రాకపోకల వివరాలను ప్రాజెక్టు అఽధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి వివరాలను పరిశీలించారు. నాగార్జునకొండకు చేరుకుని మ్యూజియం, సింహళీయం తిలకించారు. సాయంత్రం బుద్ధవనం సందర్శించిన అనంతరం హైదరాబాద్‌ బయలుదేరివెళ్లారు.

Updated Date - May 29 , 2026 | 03:41 AM