పచ్చదనమే భావితరాలకు వరం
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:20 PM
పచ్చదనమే భావితరాలకు వరమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు.
- రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
- జిల్లాలో ఘనంగా ప్రారంభమైన వన మహోత్సవం
నాగర్‌కర్నూల్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : పచ్చదనమే భావితరాలకు వరమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఇందిరా మ హిళాశక్తి భవన సమీపంలో గల ప్రభు త్వ స్థలంలో వనమహోత్సవంలో భాగంగా శ నివారం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి, ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయ ణరెడ్డి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్రలు మొక్కలు నాటారు. మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, వాతా వరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత వంటి సమస్యలను ఎదుర్కోవాలంటే విస్తృత స్థాయిలో వృక్షాల పరిరక్షణ చేపట్టడం అత్యంత అవసరమన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడు తూ ప్రకృతి సంపదను పరిరక్షించడం ప్రతీ పౌ రుడి సామాజిక బాధ్యతఅన్నారు. జిల్లాలో 35 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అ న్నారు. కార్యక్రమంలలో నాగర్‌కర్నూల్ మునిసి పల్ చైర్మన్ తీగల సునేంద్ర, జిల్లా అటవీశాఖ అధి కారి రేవంత్‌చంద్ర, అదనపు కలెక్టర్ అమ రేందర్, పీడీ డీఆర్‌డీఏ చిన్న ఓబులేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.