Share News

సహకార సంఘాల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌...

ABN , Publish Date - Aug 03 , 2026 | 10:54 PM

రైతులకు వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులకు పంట రుణాలు, రాయి తీపై విత్తనాలు, ఎరువులు అందిస్తూ అండగా నిలవ డం సహకార సంఘాల విధి.

సహకార సంఘాల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌...
జన్నారంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార భవనం

-డైరెక్టర్‌, చైర్మన్ల పదవుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు

-కొత్త మండలాల్లోనూ ఏర్పాటు కానున్న పీఏసీఎస్‌లు

-జిల్లాలో అదనంగా 16 పీఏసీఎస్‌ల ఏర్పాటుకు అవకాశం

-వాటితోపాటే ఇతర కమిటీలకూ కసరత్తు

మంచిర్యాల, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రైతులకు వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులకు పంట రుణాలు, రాయి తీపై విత్తనాలు, ఎరువులు అందిస్తూ అండగా నిలవ డం సహకార సంఘాల విధి. గత బీఆర్‌ఎస్‌ హయాం లో జిల్లాలో కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతి పాదనలు వచ్చినా...అవి బుట్టదాఖలు కావడంతో విస్త రణకు నోచుకోలేదు. కొత్తవి ఏర్పాటు చేయకపో యి నా...కనీసం ఉన్నవాటిని కూడా బలోపేతం చేయక పో వడంతో రైతులకు వాటి సేవలు అంతంత మాత్రంగా నే అందుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సం ఘాల పరిధి ఎక్కువగా ఉండటంతోపాటు గ్రామాలకు దూరంగా ఉండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మండలాల్లో సహకా ర సంఘాలు లేకపోవడంతో ఆయా మండలాల రైతు లు ఇతర మండలాల్లోని సొసైటీలకు వెళ్లాల్సి వస్తోం ది. ఇదిలా ఉండగా జిల్లాలో కొన్ని సొసైటీల పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉండగా, మరికొన్ని సొసైటీలకు తక్కువ గ్రామాలు ఉన్నాయి. దీంతో దూరంగా ఉన్న సొసైటీలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లే రైతులు ఇ బ్బందులు పడుతున్నారు.

ప్రతిపాదనల దశలో నిలిచిన విస్తరణ....

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత జిల్లాలు, మండలాల పునర్విభజన జరిగిన అనంతరం ఆ మేర కు రైతులకు సహకార సేవలను మరింతగా పెంచేం దుకు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సహకార సంఘాల విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సహ కార శాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిం ది. అధికారులు క్షేత్రస్థాయిలో అద్యయనం చేసి, గ్రా మాల్లో సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను కూడా సేకరించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న సహకార సంఘాలకు అదనంగా ఎన్ని అవసరం అవుతాయో అంచనా వేసి ప్రతిపాదనలు తయారు చేశారు. సం బంధిత నివేదికలను ప్రభుత్వానికి పంపారు. దీంతో సహకార సంఘాల విభజనకు రంగం సిద్ధంకాగా, డ్రా ఫ్టు నోటిఫికేషన్‌ కూడా జారీ అయింది. సహకార సం ఘాల విభజనే తరువాయి అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయం మరుగున పడింది. 2020 ఫిబ్రవరి 15న ప్రభుత్వం సహకార ఎన్నికలను నిర్వహించింది. ఎన్నికల సమయంలోనే సంఘాలను విస్తరించాలని ప్రతిపాదించగా, అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపో వడంతో విస్తరణ ప్రక్రియ ముందుకు సాగలేదు.

నూతన సహకార విధానానికి మంగళం....

సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించి గతం లో కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ సహకార విధానా నికి శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం ప్రతి గ్రామానికి ఒక ప్రాథమిక సహకార సంఘం, ఒక మత్స్య సహకా ర సంఘం, ఒక పాల ఉత్పత్తి సహకార సంఘం ఉం డాలనేది ఈ నూతన సహకార విధానం ఉద్దేశ్యం. కేంద్ర సహకార శాఖ మంత్రిగా అమిత్‌షా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏర్పాటు చేసిన జాతీయ సహకార సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నూత న విధానాన్ని అనుసరించాలని రాష్ట్రాలకు కూడా అమి త్‌ షా సూచనలు చేశారు. గత ప్రభుత్వం దీన్ని పెద్ద గా పట్టించుకోవడంతో నూతన విధానానికి మంగళం పాడినట్లయింది. ఈ విషయంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో పదవులు ఆశిస్తు న్న వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

విభజిస్తేనే సేవలు విస్తృతం...

వ్యవసాయంలో రైతులకు అన్ని రకాలుగా వెన్నుద న్నుగా ఉండే సహకార సంఘాల సేవల విస్తరణతో పాటు కొత్త మండలాల్లోనూ ఏర్పాటు చేస్తే మరింతగా ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ప్రభుత్వం కొత్తగా 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఏఈవోలను నియమించింది. అదే తరహాలో రైతులకు అందుబాటులో ఉండేలా సొ సైటీలను విభజించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి. ఒక్కో సొసైటీలో వేలాది మంది రైతులు సభ్యులుగా ఉండ గా, ఏ అవసరం వచ్చినా క్యూలు కట్టాల్సి వస్తోంది. ప్రతి సీజన్‌ ఆరంభంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు బారులు తీరిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వం సహకార సంఘాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండటంతో జిల్లాలో మరో 16 సంఘాలు కొత్తగా ఏ ర్పాటయ్యే అవకాశం ఉంది. అప్పుడు జిల్లాలోని రైతుల కు సహకార సంఘాల సేవలు సైతం విస్తరించే అవ కాశాలు మెండుగా ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 21 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, వాటి పదవీ కాలం గత ఏడాది ఏడాది జనవరితో ము గిసింది. అప్పటి నుంచి ప్రభుత్వం పీఏసీఎస్‌ల కాల పరిమితి 6 నెలలకోసారి పెంచుతూ వస్తోంది. ప్రస్తు తం పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూప డటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నామినేటెడ్‌ పోస్టులకూ మార్గం సుగమం...

పీఏసీఎస్‌ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులతోపాటు ఇత ర కీలక నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభు త్వం నిర్ణయించింది. ఈ విషయమై ఈ నెల 1వ తే దీన గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కు మార్‌ గౌడ్‌, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు సమావేశమై నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు, విధివి ధానాలను ఖరారు చేశారు. ఇందులో భాగంగా పీఏసీ ఎస్‌ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులతోపాటు నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ని ర్ణయంతో జిల్లాలో ఖాళీగా ఉన్న మార్కెట్‌ కమిటీలు, దేవస్థాన కమిటీల పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ పదవుల్లో పెద్దపీట వేయనున్నారు. మండల పార్టీ మాజీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు పోస్టుల్లో ప్రాధా న్యం ఇవ్వాలని నిర్ణయించారు.

Updated Date - Aug 03 , 2026 | 10:54 PM