రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టు సర్వేకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Mar 15 , 2026 | 07:06 AM
హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రైల్(ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన కోసం అవసరమైన సర్వే నిర్వహించేందుకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది.
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 14(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రైల్(ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన కోసం అవసరమైన సర్వే నిర్వహించేందుకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభలో గతంలో రూల్ 377 కింద లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు ఈ మేరకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రీజినల్ రింగ్ రోడ్ వెంబడే ఈ రైల్వేలైన్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.