kumaram bheem asifabad- హరిత లక్ష్యం.. మొక్కలు సిద్ధం
ABN , Publish Date - May 17 , 2026 | 10:16 PM
రాష్ట్రంలో పచ్చదనం పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం నిర్వయించే వన మహోత్సవ కార్యక్రమానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. 12వ విడతలో నిర్దేఽశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటికే గ్రామంల్లోని నర్సరీల్లు మొక్కలు సిద్ధం చేస్తున్నారు
రెబ్బెన, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పచ్చదనం పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం నిర్వయించే వన మహోత్సవ కార్యక్రమానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. 12వ విడతలో నిర్దేఽశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటికే గ్రామంల్లోని నర్సరీల్లు మొక్కలు సిద్ధం చేస్తున్నారు జూన్ చివరి వారం లేదా జూలై మొదటి ,రెండో వారాల్లో మొక్కలు నాటేందుకు డీఆర్‌డీఏ, అటవీశాఖ అధికారు లు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ప్రభు త్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువుగట్లు, ప్రభుత్వ కార్యాలయా లు, ప్రైవేటు సంస్ధలు, పరిశ్రమలు, కమ్యూ నిటీ కేంద్రాలు, వైద్యశాలలు, కళాశాలలు, పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటనున్నా రు. ప్రజలకు, రైతులకు నచ్చిన మొక్కలను ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతు న్నారు. 32.64లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించారు.
15 మండలాల పరిధిలో..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీల్లో వివిధ శాఖల ఆధ్వ ర్యంలో 32.64 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వీటి కోసం గ్రామ పంచాయతీ ఒకటి చొప్పున నర్సరీ ల ను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నర్సరీలో సుమారు 9.775 మొక్కలు పెంచుతున్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి, అటవీ, విద్య శాఖ, పంచాయతీరాజ్‌శాఖతో పాటు వివిధ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించ నున్నారు. మొక్కల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు నర్సరీ ల్లో గ్రీన్ మ్యాట్ల ద్వారా రక్షణ కల్పిస్తున్నారు. ప్రతి నర్సరీకి వనసేవకుడిని నియమించి ఉదయం, సాయంత్రం సమయాల్లో మొక్కల కు నీళ్లు పట్టడంతో పాటు సంరక్షణ పనులు చేస్తున్నారు. కాగా నర్సరీల్లో ఎక్కువగా పండ్లు, పూల మొక్కలతో పాటు నీడనిచ్చే వేప, మర్రి, బురుగ చెట్లును పెంచుతు న్నా రు. దీంతో పాటు ఇంటింటికీ ఆరుమొక్కలు పంపిణీ చేసేందుకు మావిడి, జామ, ఉసిరి, నేరేడు, సీతాఫలం లాంటి మొక్కలు సిద్ధం చేస్తున్నారు.
మండలాల వారీగా ఇలా..
మండలం మొక్కల
పెంపకం లక్షల్లో..
ఆసిపాబాద్ 2.54
బెజ్జుర్ 2.15
చింతలమానెపల్లి 1.85
ద యిగాం 2.35
జైనూర్ 2.54
కాగజ్‌నగర్ 2.73
కెరమెరి 3.03
కౌటాల 1.95
లింగాపూర్ 1.35
పెంచికల్‌పేట్ 1.17
రెబ్బెన 2.34
సిర్పూర్ (టి) 1.55
సిర్పూర్(యు) 1.45
తిర్యాని 2.82
వాంకిడి 2.72
మొత్తం 32.64