kumaram bheem asifabad-వైఎస్సార్‌కు ఘన నివాళి
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:14 PM
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గఇన్‌చార్జీ అజ్మీర శ్యాంనాయక్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు
ఆసిఫాబాద్‌రూరల్/వాంకిడి సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గఇన్‌చార్జీ అజ్మీర శ్యాంనాయక్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజసంక్షేమమే ధ్యేయంగా పేదల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగు ప్రజలగుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, నాయకులు మురళీ, మారుతి పటేల్, దీపక్ ముండే తదితరులు పాల్గొన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు సెల్వట్‌కార్ పెంటు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చిస్థాయిగా నిలిచారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లెందుకు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బంబార సర్పంచ్ కృష్ణాజీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్నులే నారాయణ, దీపక్‌ముండే, సుధాకర్, బంటి, దాదాజీ, శివాజీ, హంసరాజ్, అనిల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.