kumaram bheem asifabad- రాజీవ్‌గాంధీకి ఘన నివాళి
ABN , Publish Date - Aug 20 , 2026 | 10:50 PM
- పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నాయకులు, కార్యకర్తలు
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్ పట్టణంలోని రాజీవ్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించిన దార్శనిక నాయకుడని కొనియాడారు. రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం డీసీసీ కార్యాలయంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ మంగ, డీసీసీ ఉపాధ్యక్షుడు తారీక్, భీంరావు, బాబాపూర్ సర్పంచ్ రాజన్న, నాయకులు అసద్, చిట్ల నారయణ, మారుతి, శంకర్, ఇమ్రాన్, కలీం, నిఖిల్, కాశన్న తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): పట్టణంలో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఆదిత పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రాజీవ్‌గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కేసరి కిషన్‌గౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మహ్మద్ సుజాయిత్ ఖాన్, సీనియర్ నాయకులు సిడాం జగన్నాథ్, రాథోడ్ రోహిదాస్, గోగర్ల రాజయ్య, జాదవ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ నైతం రాంచందర్, పార్టీ జిల్లా కార్యదర్శి శోభన్, మాజీ సర్పంచ్ ఆత్రం లక్ష్మణ్, మాజీ సర్పంచ్ జమున తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ రషీద్ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్, పెందుర్ గంగామణి, సిర్పూర్(యు) మండల అధ్యక్షుడు ఆత్రం శంకర్, డీసీసీ కార్యవర్గ సభ్యులు పెందుర్ ప్రకాష్. సర్పంచ్‌లు విఠల్, రాథోడ్ రాందాస్, ఉయిక చందన్‌షావ్, ఉయిక చందు పాల్గొన్నారు.