Share News

kumaram bheem asifabad-మహాత్మాగాంధీకి ఘన నివాళి

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:19 PM

జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో శుక్రవారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు అధికారులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ పిల్లల ఉద్యాన వనంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.

kumaram bheem asifabad-మహాత్మాగాంధీకి ఘన నివాళి
కాగజ్‌నగర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు

కాగజ్‌నగర్‌/కౌటాల/సిర్పూరు(టి)/రెబ్బెన/పెంచికల్‌పేట్‌/చింతలమానేపల్లి/దహెగాం,/తిర్యాణి/కెరమె/బెజ్జూరు అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో శుక్రవారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు అధికారులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ పిల్లల ఉద్యాన వనంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం బస్టాండులో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కను నాటారు. టీడీపీ ఆదిలాబాద్‌ పార్లమెంటు అధ్యక్షుడు, సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గుళ్లపల్లి ఆనంద్‌ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, తహసీల్దార్‌, మున్సిపల్‌, ఫారెస్టు రేంజ్‌ కార్యాలయంలో గాంధీ జయంతీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ హర్షచౌదరి, ఎఫ్‌డీవో భార్గవ్‌, తహసీల్దార్‌ మఽధూకర్‌, ఎఫ్‌ఆర్వో లక్ష్మీనారాయణ, ఎంపీడీవో ఉజ్వల్‌కుమార్‌, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ షాహిన్‌ సుల్తానాతో పాటు సిబ్బంది గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ కౌన్సిలర్ల ఆద్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. కౌటాలలో మండల విద్యావనరుల కేంద్రంలో గాంధీజయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో నానాజీ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాల సాధనకు పాటుపడాలని కోరారు. సిర్పూరు(టి) ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా గాంఽధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీడీవో కోట ప్రసాద్‌ గాంధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెంచికల్‌పేటలో తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రవీందర్‌ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎల్కపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ భక్తు రాంచందర్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. రెబ్బెన మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కేసరి కిషన్‌ గౌడ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె ప్రకాష్‌ రావు, చెన్న సోమశేఖర్‌, చిరంజీవిగౌడ్‌తో పాటు తదితరులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలో గాంధీ జయంతీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్‌ మేకల పోశక్క, ఉప సర్పంచి టొంబ్రే శ్రీనివాస్‌, ఎంపీడీవో సత్యనారాయణ గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. దహెగాం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. తిర్యాణి, కెరమెరి మండల కేంద్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీవో వినోద్‌ కుమార్‌, ఏపీవో చంద్రయ్య, ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు ఘనపురం నాగేష్‌, రాచకొండ రాజు, కృష్ణ, పుల్లూరి రామన్న, రావుల కృష్ణ, భాస్కర్‌, సత్యనారాయణ, సంతోష్‌, డీటీ చిన్ను, మాజీ కోఆప్షన్‌ సభ్యులు జహురోద్దీన్‌, లింగంపల్లి ప్రభాకర్‌, శంకరమ్మ, ఓమిత్‌మండల్‌, కాంగ్రెస్‌ పార్టీ దహెగాం మండల అధ్యక్షుడు పోతుగంటి భీమన్న, నాయ కులు ఎల్కమోహన్‌, నగేష్‌, రాకేష్‌, శేఖర్‌, మధూకర్‌ పాల్గొన్నారు. బెజ్జూరు మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవాదళ్‌ రాష్ట్ర కార్యదర్శి సామల కిరణ్‌కుమార్‌, వాసవి క్లబ్‌ అధ్యకుడు రాచకొండ శ్రీవర్దన్‌, గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, సభ్యులు తంగడిపల్లి మహేష్‌, పెంటన్న, నేరెళ్ల సంతోష్‌, మిర్యాల వెంకటరమణ, కళావతి, అంజమ్మ, పావని, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాద్యక్షుడు కోండ్ర జగ్గాగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:19 PM