Share News

kumaram bheem asifabad-కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

ABN , Publish Date - Sep 21 , 2026 | 10:30 PM

జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆశయాల సాధనకు పాటుపడాలని పలువురు నాయకుల పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘ భవనంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

kumaram bheem asifabad-కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి
ఆసిఫాబాద్‌లో :కొండాలక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆశయాల సాధనకు పాటుపడాలని పలువురు నాయకుల పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘ భవనంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని జగ్జీవన్‌రాంచౌక్‌లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మంగ, పద్మశాలి సంఘం నాయకులు శ్రీకాంత్‌, లింగయ్య, మోహన్‌, శంకర్‌, పుష్పలత, క్రాంతి, రేవతి, ధర్మయ్య, శ్యాం, మోహన్‌, అజయ్‌, రామన్న, రవి, వెంకటేష్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు కేశవరావు, మహేష్‌, రాజలింగు, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): స్థానిక జేత్వాన్‌ బుద్ధ విహార్‌లో అంబేడ్కర్‌ యువజన సంఘం, లక్ష్మణ్‌ సేవాసదన్‌, ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో లక్ష్మణ్‌ సేవాసదన్‌ సంస్థ చైర్మన్‌ గాదే అవినాష్‌, వైస్‌ చైర్మన్‌ అశోక్‌, ప్రధానకార్యదర్శి మడావి దౌలత్‌, కుమార్‌, అంబెడ్కర్‌ యువజన సంఘం నాయకులు దుర్గం శ్యాంరావు, విలాస్‌, రాజేశ్వర్‌, రమేశ్‌, విఠల్‌, రోషన్‌, పాండుజీ, బుద్దాజీ, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో సోమవారం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సామల తిరుపతి, సభ్యులు వెంకటేష్‌, కనికుట్ల శ్రీనివాస్‌, శంకర్‌, శ్రీనివాస్‌, రమేశ్‌, గణేష్‌, నారాయణ, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 10:30 PM