kumaram bheem asifabad- ఘనంగా రాఖీ వేడుకలు
ABN , Publish Date - Aug 28 , 2026 | 10:50 PM
రక్షాబంధన్ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమను గుర్తుచేసుకునే పండుగ మాత్రమే కాదు, రక్షణ, అప్యాయత, నమ్మకానికి ప్రతీకగా భావించే ప్రత్యేమైన రోజు, ప్రతీ ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. జిల్లా వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోదరీమణులు వారి సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు
ఆసిఫాబాద్‌రూరల్/కాగజ్‌నగర్/సిర్పూర్(టి)/కెరమెరి/తిర్యాణి/సిర్పూర్(యు/బెజ్జూరు/వాంకిడి/దహెగాం/పెంచికల్‌పేట/చింతలమానేపల్లి/కౌటాల, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రక్షాబంధన్ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమను గుర్తుచేసుకునే పండుగ మాత్రమే కాదు, రక్షణ, అప్యాయత, నమ్మకానికి ప్రతీకగా భావించే ప్రత్యేమైన రోజు, ప్రతీ ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. జిల్లా వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోదరీమణులు వారి సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. రాఖీ పండుగ సందర్భంగా స్వీట్ల దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. మార్కెట్‌లో సైతం రాఖీల కొనుగోళ్లతో సందడి నెలకొన్నది. స్వచ్ఛంద సంస్థలు, కార్యాలయాలు, ఆలయాల్లో రక్షాబంధనం నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిననాయకులు వేడుకల్లో పాలు పంచుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయాల్లోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆసిఫాబాద్ పట్టణంతో పాటు మండలంలోని ప్రజలు రాఖీ పౌర్ణమీ వేడుకలను అనందోత్సవల మధ్య జరుపుకున్నారు.ఎమ్మెల్యే కోవ లక్ష్మి పీఏసీఎస్ చైర్మన్ ఆలీబీన్ ఆహ్మద్‌తో పాటు పలువురికి రాఖీలు కట్టారు. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ హైదరాబాద్ పట్టణంలోని జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టారు. లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని వివేకానందచౌక్‌లో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఆహ్మద్, కౌన్సిలర్ సాలం, నాయకులు జీవన్, నిసార్, ఆహ్మద్, సమద్, బలరాం, జావిద్, లయన్స్‌క్లబ్ నాయకులు రమణరెడ్డి, ప్రకాష్, శంకర్ పాల్గొన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలో శుక్రవారం రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా నిలిచింది. కాగజ్‌నగర్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు రాజీక్ రహెమాన్‌కు హిందూ సోదరీమణలు పోలు వరలక్ష్మి, దోమ స్నేహ, ధనలక్ష్మి రాఖీ కట్టడం విశేషం. ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుకు వివిధ వార్డులకు చెందిన మహిళలు రాఖీ కట్టారు. సూదుర ప్రాంతాల నుంచి తమ సోదరులకు రాఖీ కట్టేందుకు మహిళలు బస్సులు, రైళ్ల ద్వారా కాగజ్‌నగర్‌కు చేరుకున్నారు. రాఖీలతో పాటు స్వీట్లను కొనుగోలు చేసేందుకు పట్టణంలోని వివిధ దుకాణాలకు రావడంతో ఒక్కసారిగా రద్దీ ఏర్పడింది. సిర్పూరు(టి)లో ఉదయం మహిళల రాకపోకలతో రద్దీ నెలకొన్నది. కెరమెరిలో సోదరిమణులు ఉదయానే వివిధ గ్రామాల నుంచి వచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రక్షాబంధన్ వేడుకలను ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం అధికారి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సుజాయిత్ ఖాన్‌కు పలువురు మహిళలు రాఖీ కట్టి మతసామరస్యాన్ని చాటుకున్నారు. తిర్యాణి మండలం రాఖీలు దుకాణాలు, స్వీటు షాపుల వద్ద రద్దీ ఏర్పడింది. ఉదయం నుంచి వివిధ బస్సులు, ఆటోల ద్వారా తమ సోదరులకు రాఖీ కట్టేందుకు మహిళలు తమ పుట్టింటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో రద్దీ నెలకొన్నది. సిర్పూర్(యు) మండలంలో రక్షాబంధన్ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యదవ్‌రావు, జైనూర్ ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పార్వతి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. బెజ్జూరు, వాంకిడి, దహెగాం, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట, కౌటాల మండలాల్లో రక్షాబంధన్ సందడి నెలకొన్నది.