Share News

kumaram bheem asifabad- ఘనంగా గణేశ్‌ నిమజ్జనం

ABN , Publish Date - Sep 24 , 2026 | 10:29 PM

జిల్లాలోని పలు మండలాల్లో గురువారం గణేశ్‌ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెంచి కలపేట్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రతిష్టించిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.

kumaram bheem asifabad- ఘనంగా గణేశ్‌ నిమజ్జనం
దహెగాంలో శోభాయాత్రలో పాల్గొన్న కళాకారులు

- పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు

పెంచికల్‌పేట్‌/కాగజ్‌నగర్‌/దహెగాం/కెరమెరి సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో గురువారం గణేశ్‌ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెంచి కలపేట్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రతిష్టించిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఎస్సై అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆట, పాటలతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం గణనాథుడిని స్థానిక పెద్దవాగులో నిమజ్జనం చేశారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్‌బీహెచ్‌ సమీపంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాఢుడి విగ్రహాన్ని బుధవారం రాత్రి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టణ వీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. అనంతరం స్థానిక పెద్దవాగులో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. దహెగాం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గణేష్‌ నిమజ్జన కార్యక్రమాన్ని గురువారం పలు చోట్ల నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీల్లో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం సమీప వాగులో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కెరమెరి మండలంలోని గోయగాం గ్రామంలో వినాయక నిమజ్జన కార్యమ్రాన్ని నిర్వహించారు. స్థానిక హనుమాన్‌ ఆలయంలో ప్రతిష్టించిన గణనాథుడి విగ్రహంతో పాటు వివిధ చోట్ల ఉన్న గణనాథులను ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భాజాభజంత్రీలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర ్భంగా మహిళలు మంగళహారతులతో వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో గ్రామ పటేల్‌ శంకర్‌, సోలాజీ మహారాజ్‌, లక్ష్మణ్‌తో పాటు సునీల్‌, సురేష్‌, మనోహర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 10:29 PM