ఘనంగా విజయదశమి వేడుకలు
ABN , Publish Date - Oct 22 , 2026 | 01:12 AM
విజయదశమి వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. జగిత్యాల పట్టణంలోని జమ్మిగద్దె వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన షమీ పూజలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్యప్రణవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ ప్రజలు
జగిత్యాల టౌన్, అక్టోబరు21(ఆంధ్రజ్యోతి): విజయదశమి వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. జగిత్యాల పట్టణంలోని జమ్మిగద్దె వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన షమీ పూజలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్యప్రణవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, జగిత్యాల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. దుర్గా మండపాల్లో శరన్న నవరాత్రులు పూర్తి చేసుకున్న దుర్గాదేవి విగ్రహాలను ఆయా దుర్గా సేవాసమితిలు ఆధ్వర్యంలో పట్టణంలో ఊరేగింపు నిర్వహించి మహిషసుర వధ అనంతరం అమ్మవార్లను నిమజ్జనం చేశారు. నవదుర్గ సేవా సమితి, కనకదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో జమ్మిగద్దె వద్ద దుర్గాదేవి చేతుల మీదుగా మహిషసురుని వధించగా, సువర్ణ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ధరూర్ క్యాంపు శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో మహిషాసురుని దహనం చేశారు. కనక దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో చేతిలో బొద్దింకను పట్టుకున్న మహిషాసురుడిని ఏర్పాటు చేసి బొద్దింక లాంటి వ్యక్తులను నమ్మకండి అనే కోటేషన్ ప్రదర్శించి.. మహిషాసురుడిని అమ్మవారి చేతులతో నిప్పుపెట్టి వధించారు. వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన షమీ పూజలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. గండ్ర రాధమ్మ- రాఘవేందర్ రావు పేరుతో ఏర్పాటు చేసిన ప్రశాంత నిలయం వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఎస్పీ అశోక్ కుమార్ డీఎస్పీ పురుషోత్తంరెడ్డితో కలిసి పట్టణంలోని జమ్మిగద్దెను సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాలలో పట్టణ సీఐ కరుణాకర్, నాయిబ్ తాహసీల్దార్ రాజేందర్ రావు, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.