Temple Festival: ఘనంగా కొమురవెల్లి పట్నం వారం
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:14 AM
సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో తొలి ఆదివారం ‘పట్నం వారం’ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి.
పోటెత్తిన భక్తులు.. బోనాలతో మొక్కుల చెల్లింపు
కొమురవెల్లి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో తొలి ఆదివారం ‘పట్నం వారం’ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన వేలాది మంది భక్తులతో మల్లన్న క్షేత్రం కిక్కిరిసిపోయింది. స్వామి వారికి పట్నాలు వేసిన భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ జోగినుల నృత్యాలు, శివ సత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదివారం సుమారు 80 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు చెప్పారు. సోమవారం పెద్దపట్నం, అగ్ని గుండాలు కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు మరింత ఉత్సాహంగా సాగనున్నాయి.