Share News

గ్రామసభలు విజయవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:31 PM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌ 2న జరిగే వార్డు, గ్రామ స భలను విజయవంతంగా నిర్వహించాలని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశిం చారు.

గ్రామసభలు విజయవంతంగా నిర్వహించాలి
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, అదనపు కలెక్టర్లు

- ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌ 2న జరిగే వార్డు, గ్రామ స భలను విజయవంతంగా నిర్వహించాలని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశిం చారు. సెక్రటేరియేట్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వీడియో కా న్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఉప ముఖ్యమంత్రికి వివరిస్తూ నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో నిర్వహించే గ్రామసభలకు సర్పంచ్‌, మునిసి పాలిటీలో చైర్‌పర్సన్‌, వార్డు సభ్యులు, పంచాయ తీ కార్యదర్శి సంబంధిత శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాల స భ్యులు, యువత, రైతులు, స్వచ్ఛంద సంస్థల స భ్యులను వివిధ పథకాల లబ్ధిదారులు హాజరయ్యేలా అధికారుల ద్వా రా ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్ర భుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ప్రజాపాలన ప్రగ తి ప్రణాళిక 99రోజుల కార్యాచ రణ ప్రణాళికను జిల్లాలో స మర్థవంతంగా నిర్వర్తించడం తో పాటు ప్రజల అవసరాలను గుర్తించి అందుకనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్ట ర్‌ వివరించారు. ఎండ తీవ్ర తను దృష్టిలో ఉంచుకుని ప్రజ లకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన అత్యవసర ఏర్పాట్లతో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉం చాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించామని కలెక ్టర్‌ తెలిపారు. జిల్లాలో రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, ముఖ్యంగ అంగన్‌వాడీల నుంచి ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులకు అల్పాహారం అందించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, అమరేందర్‌, జిల్లా పరిషత్‌ సీఈవో దేవసహాయం, ఇతన శాఖల అధికారులు హాజరయ్యారు.

Updated Date - Mar 31 , 2026 | 11:31 PM