Share News

kumaram bheem asifabad- సమస్యలు తెలుసుకునేందుకే గ్రామసభలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 10:26 PM

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికను ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిందని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండలంలోని మెట్‌పల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ కుడ్మెత భీంరావు అధ్యక్షతన గురువారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు కల్యాణలక్ష్మి, గృహ జ్యోతి, మహిళకు ఉచిత బస్సు తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.

kumaram bheem asifabad- సమస్యలు తెలుసుకునేందుకే గ్రామసభలు
గ్రామసభలో అధికారులు, గ్రామస్తులతో కలిసి గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్‌ కె హరిత

సిర్పూర్‌(టి), ఏప్రిల్‌ 2 (ఆంఽధ్రజ్యోతి): ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికను ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిందని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండలంలోని మెట్‌పల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ కుడ్మెత భీంరావు అధ్యక్షతన గురువారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు కల్యాణలక్ష్మి, గృహ జ్యోతి, మహిళకు ఉచిత బస్సు తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. దీంతో పాటు ఇంకా రానున్న రోజుల్లో ప్రభుత్వం మరో నాలుగు పథకాలు ప్రజలకు అందిస్తుందన్నారు. అందులో ఇంటి పెద్దకు ఇన్సూరెన్స్‌, పాఠశాల, కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ పథకాలను అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ప్రజలు కూడా సంక్షేమ పథకాలను లబ్ధి పొందాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై క్షేత్రస్థాయికి వెళ్లి లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని కోరారు. కొందరు లబ్ధిదారులు ఇసుక కోసం ఇబ్బంది పడాల్సి వస్తుందని కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. కలెక్టర్‌ స్పందిస్తూ ఇసుక అందేలా కృషి చేస్తామన్నారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకుని లబ్ధి పొందాలని ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకు రావాలన్నారు. అంతకు ముందు గ్రామానికి వచ్చిన కలెక్టర్‌ను పూలమాలలు, శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రతే ్యకాధికారి వినోద్‌, అగ్రికల్చర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ నర్సింహరావు, పంచాయతీ రాజ్‌ ఈఈ ధర్మేందర్‌, డీఈ అశ్విన్‌, ఏఈ అనీల్‌కుమార్‌, ఏఈవో నేహాతబస్సుం పాల్గొన్నారు.

సఖి కేంద్రాన్ని తనిఖీ చేసి.. వివరాలు తెలుసుకుని..

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో గల సఖి కేంద్రాన్ని గురువారం కలెక్టర్‌ కె హరిత తనిఖీ చేసి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలకు అందిస్తున్న సేవలు, సదుపాయాలు, నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత వాతావరణం కల్పించి వారి సమస్యలు తక్షణం పరిష్కారం కోసం సఖి కేంద్రం పని చేస్తుందని తెలిపారు. బాధిత మహిళలకు కౌన్సెలింగ్‌, న్యాయ సహాయం, వైద్య సేవలు, ఆశ్రమం కల్పన వంటి సేవలు అందుతున్నాయని తెలిపారు. సఖి కేంద్రంలో ఉన్న రికార్డులను పరిశీలించి నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుత స్థితి తెలుసుకున్నారు. ప్రతి కేసులో సమయానుకూలంగా స్పందించి బధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సఖి కేంద్రంలో శుభ్రత, భద్రత, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. మహిళలపైన జరుగుతున్న దాడులను, వేధింపులను అరికట్టడంలో సఖి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్‌ అన్నారు. సమాజంలో మహిళలు భయ పడకుండా ముందుకు వచ్చి తమ సమస్యలను తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిలా స్థాయి వరకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సఖి కేంద్రం సిబ్బందితో మాట్లాడుతూ మహిళలకు అందిస్తున్న సేవల వివరాలు తెలుసుకుని ప్రతి కేసును సున్నితంగా పరిష్కరించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని అన్నారు. మహిళల గోప్యతను కాపాడుతూ సేవలు అందించాల న్నారు. కార్యక్రమంలో సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 10:26 PM