ధాన్యం అన్‌లోడింగ్ వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:47 AM
ధాన్యం అన్‌లోడింగ్ వేగవంతం చేయాలని, హమాలీల సంఖ్య ను పెంచి, అన్‌లోడింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్దాపూర్ లోని వ్యవసాయ మార్కెట్
సిరిసిల్ల అర్బన్, జూన్ 9 (ఆంఽధ్రజ్యోతి): ధాన్యం అన్‌లోడింగ్ వేగవంతం చేయాలని, హమాలీల సంఖ్య ను పెంచి, అన్‌లోడింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్దాపూర్ లోని వ్యవసాయ మార్కెట్ యా ర్డులోని గోదాముల్లో ధాన్యం అన్‌లోడింగ్ చేస్తున్న తీరు ను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వాహనాల్లోని ధాన్యం హమాలీల సంఖ్యను మరింత పెంచి అన్ లోడింగ్ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని, అన్‌లోడ్ చేసిన వాహనాలను ధాన్యం లోడింగ్ కోసం ఇతర కేం ద్రాలకు తరలించాలని సూచించారు. వ్యవసాయ మా ర్కెట్ యార్డులోని గోదాముల్లో ధాన్యం నిల్వ చేస్తున్న తీరు, గోదాముల సామర్థ్యం వివరాలను అధికారులను అడిగి ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వాహ నాలను జాప్యం చేయకుండా లోడింగ్ చేసి తరలించేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశిం చారు. ఈ సందర్శనలో పౌర సరఫరాల అధికారి బుచ్చి బాబు, మేనేజర్ నరసింహ, సిరిసిల్ల, వేములవాడ తహసీల్దార్లు మహేష్, జయంత్ తదితరులు ఉన్నారు.
సాలిడ్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన ఉండాలి
సిరిసిల్ల టౌన్ : సాలిడ్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లా కేం ద్రం మున్సిపల్ డీఆర్‌సీ(డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్)కేంద్రంలో తెలంగా ణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సాలిడ్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు - 2026 అమలుపై అవగాహన సదస్సును నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ముందుగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నోడల్ అధికారులు సాలిడ్ వ్యర్థాల నిర్వహణ, నిబంధనాల ముఖ్యాంశాలను వివరించి డీఆర్‌సీ కేంద్రం లో జరుగుతున్న వ్యర్థాల నిర్వహణ ప్రక్రియలను అధికా రులకు, సిబ్బందికి ప్రత్యక్షంగా చూపించి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదుస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వ్యర్థాల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలని కంపోస్ట్ షెడ్లను సమర్ధవంతగా వినియోగించుకోవాలన్నారు. బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారులను గుర్తించి నిబంధనల అమ లులో నిర్లక్ష్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్, సిరిసిల్ల, వేములవాడ కమిషనర్లు ఎండీ ఖాదీర్‌పాషా, లోకేష్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.