ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలి
ABN , Publish Date - May 26 , 2026 | 11:20 PM
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేం ద్రాలలో నిల్వ ఉంచిన ధాన్యాన్ని వెంటనే కొను గోలు చేసి గోదాములకు, రైసు మిల్లులకు తరలించా లని బీజేపీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చే శారు.
- బీజేపీ నియోజక వర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్ రావు
కోడేరు, మే 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేం ద్రాలలో నిల్వ ఉంచిన ధాన్యాన్ని వెంటనే కొను గోలు చేసి గోదాములకు, రైసు మిల్లులకు తరలించా లని బీజేపీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చే శారు. మంగళవారం మండల పరిధిలోని ఎత్తం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులు ఆయనతో సమస్యలు ఏకరువు పెట్టారు. వడ్లు కల్లాలోకి తీసుకొని వ చ్చి 20, 30 రోజులవుతోందని, ఇంత వరకు వడ్ల ను తూకం చేయడం లేదని అన్నారు. తూకం చేసిన వడ్లను మిల్లర్లు గోదాములక తరలించే వరకు రైతులదే బాధ్యత అని కొనుగోలు కేం ద్రం నిర్వాహకులు అనడంతో రైతులు ఏం చే యాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నా మని వారు వివరించారు. వర్షాకాలం ప్రారం భం కావడంతో ఉరుములు, మెరుపులు, గాలి వానతో వడ్లు పూర్తిగా తడిసి ముద్దవుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చెప్పిన సమస్యపై కొనుగోలు కేంద్రం నిర్వాహకుడిని ఆయన అడగగా లారీలు రావడం లేదని, హ మాలీ కూడా ఇబ్బందిగా ఉందని సమాధాన మిచ్చారు. ఏదేమైనా రెండు రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు లింగంగౌడ్, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.