Share News

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:33 AM

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిం చాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారు లతో Grain purchases should begin.

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి

సిరిసిల్ల, ఏప్రిల్‌ 18 (ఆంరఽధజ్యోతి): ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిం చాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారు లతో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రైస్‌ మిల్లర్ల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంక్‌ గ్యారంటీ తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, విద్యుత్‌ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో పెట్టాలని ఆదేశించారు. నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని సూచించారు. కూలీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. రైతులు తాము కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పిలుపు నిచ్చారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా కేంద్రాలకు తరలిం చాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల ఆన్‌లైన్‌ ప్రక్రియ, మిల్లుల కేటాయింపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ గీత, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ నరసింహ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌ బేగం, సహకార అధికారి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ వారాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగు ణంగా ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారాన్ని నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్‌ విద్యాలయా లు, హాస్టళ్లకు ప్రత్యేక అధికారులుగా మండల, జిల్లా అధికారులను ఇప్పటికే నియమించామని, వారు రోజు తమ పరిధిలోని విద్యాల యాల్లో మధ్యాహ్న భోజనం చేసి, పరిసరాలు పరిశీలించి నివేదిక అందిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పారిశుధ్య పనులు, ఆరోగ్య వారోత్సవాలు నిర్వహించామని, అరైవ్‌.. అలైవ్‌ కార్యక్రమాలు, రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించామని తెలిపారు. వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను జిల్లాలో అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని అన్నా రు. వీడియో కాన్ఫరెన్స్‌లో పీడీ హౌసింగ్‌ వెంకట మాధవరావు, డీఆర్డీఓ గీత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి భారతి, సీపీఓ శ్రీనివాసాచారి, జిల్లా పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్‌, ఎస్సీ కార్పొ రేషన్‌ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 12:33 AM