Share News

kumaram bheem asifabad- ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 24 , 2026 | 10:34 PM

రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఖమ్మం జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్డూరి లక్ష్మణ్‌, పొన్నం ప్రభాకర్‌, తుమ్మలనాగేశ్వర్‌రావు ఇతర అధికారులతో కలిసి ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌ పాల్గొన్న కలెక్టర్‌ హరిత, జిల్లా అధికారులు

ఆసిఫాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఖమ్మం జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్డూరి లక్ష్మణ్‌, పొన్నం ప్రభాకర్‌, తుమ్మలనాగేశ్వర్‌రావు ఇతర అధికారులతో కలిసి ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1.41 లక్షల మెట్రిక్‌ టన్నల వరి ధాన్యం సాగు జరిగిందని అన్నారు. 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్దేశిత మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 51 లక్షల మెట్రిక్‌ టన్నల వరి ధాన్యం కొనుగోలు చేసి 8749 కోట్ల నగదు విడుదల చేశామని వివరించారు. 21 కోట్ల గోసె సంచులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో వేచి ఉన్న 8.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేపట్టాలని తెలిపారు. నెలాఖరులోగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సరిహద్దు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి బయట రాష్ట్రాల నుంచి వరి ధాన్యం, జొన్నలు, మొక్కజొన్నలు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రాంచంద్రన్‌, పంచాయతీ రాజ్‌ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్‌లతో కలిసి మే 25 నుంచి 30 వరకు నిర్వహించే మహిళా సంక్షేమ వారంపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కెహరిత మాట్లాడుతూ జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తనెలిపారు. జిల్లాలో గుర్తించిన గోదాంలు, కేటాయించిన ప్రకారం రైస్‌ మిల్లులకు ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 10:34 PM