Share News

ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:22 AM

యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌జయంతి ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌జయంతి

కలెక్టర్‌ అనురాగ్‌జయంతి

భువనగిరి రూరల్‌, మార్చి 12(ఆంధ్రజ్యోతి): యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌జయంతి ఆదేశించారు. పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్‌, కో-ఆపరేటివ్‌, మెప్మా అధికారులతో యాసంగి ధాన్యం కొనుగోళ్ల నిర్వహణపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో యాసంగిలో సుమారు 4.5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 330 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం మిషన్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గన్నీ బ్యాగుల కొరత, రవాణా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైస్‌మిల్లులకు ధాన్యం తరలించిన వెంటనే దిగుమతి చేసుకునేలా, వేసవి దృష్ట్యా తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో నాగిరెడ్డి, పౌరసరఫరాల డీఎం హరికృష్ణ, డీఏవో రమణారెడ్డి, డీసీవో మురళి రమణ, డీటీవో సాయికృష్ణ, డీసీఎస్‌వో రోజారాణి, మార్కెట్‌ డీఎం సబిత పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:22 AM