ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 13 , 2026 | 01:40 AM
జిల్లాలో వరి దాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో వరి ధాన్యం కొనుగోళ్లపై తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో జూమ్
జగిత్యాల, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి దాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో వరి ధాన్యం కొనుగోళ్లపై తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడారు. జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పకడ్భందీగా నిర్వహించాలని ఆదేశించారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించినట్లయితే చర్యలు తప్పవన్నారు. మిల్లర్లు సకాలంలో లారీలను అన్‌లోడింగ్ చేయాలన్నారు. కేంద్రానికి రైతులు తీసుకవచ్చిన ధాన్యం త్వరితగతంగా కొనుగోలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి అవకవకలకు పాల్పడిన తగు చర్యలు ఉంటాయన్నారు. కేంద్రాల్లో కొనుగోళ్ల పురోగతి, ధాన్యం నిల్వలు, రవాణా, హమాలీలు, గన్నీ బ్యాగుల సరఫరా తదితర అంశాలపై పలు సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కొడిమ్యాల, మే 12(ఆంధ్రజ్యోతి) : రైస్ మిటల్లర్లు హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం మండలంలోని చెప్యాల లక్ష్మీగణేష్ ఇండస్ట్రీస్, లక్ష్మీసరస్వతీ ఇండస్ట్రీస్, లక్ష్మీనరసింహ ఇండస్ట్రీస్, శ్రీలక్ష్మీసాయి ఇండస్ట్రీస్‌తో పాటుగా, నమిళికొండలోని నరసింహ, ధరణి దత్తసాయి, ఛాముండి రైస్ మిల్లులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. జిల్లాలో వరిధాన్యం సేకరణ. నిల్వలను, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుంచి మిలుల్లకు వస్తున్న వరిధాన్యాన్ని ఆలస్యం చేయకుండా అన్‌లోడ్ చేయాలన్నారు. ఖాలీ లారీలను వెంటనే పంపించాలని మిల్లర్లను ఆదేశించారు. ఆర్డీవో మధుసూధన్‌గౌడ్, సివిల్ సప్లై డీఎం జితేంద్రప్రసాద్, తహసీల్దార్ నరేష్, డీటీ ఖాజాసమీ ఆహ్మద్, ఆర్‌ఐ రాజారాం సిబ్బంది ఉన్నారు,
- వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు
వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం హైద్రాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహదరి, దాసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావులతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సమీక్ష జరిపారు. రాబోయే ఒక నెల రోజులు అత్యంత కీలకమని, రైతులకు ఎలాంటి నష్ట కలగకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులకు సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. కొనుగోళ్లు సజావుగా జరిగేలా దిశానిర్దేశం చేశారు. జగిత్యాలలోని సమీకృత కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్‌తో పాటు అదనపు కలెక్టర్ బీఎస్ లత, సంబంధిత శాఖల ఇతర అధికారులు పాల్గొన్నారు.