kumaram bheem asifabad- ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 12 , 2026 | 10:18 PM
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కాగజ్‌నగర్ మండలం జంబుగలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. తేమ శాతాన్ని పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యాసంగి వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలన్నారు.
కాగజ్‌నగర్, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కాగజ్‌నగర్ మండలం జంబుగలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. తేమ శాతాన్ని పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యాసంగి వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలన్నారు. అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ధాన్యం కుప్పలను టార్పాలిన్ కవర్లను జాగ్రత్తగా గాలికి పోకుండా చూడాలని చెప్పారు.. ఎండల తీవ్రత దృష్ట్యా రైతులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. ధాన్యం తరలించేందుకు వాహనాల కొరత లేకుండా స్థానిక వాహనాలను వినియోగించుకోవాలని, ఇతర ప్రాంతాల హమాలీలపై ఆధారపడకుండా స్థానికంగా ఉన్న హమాలీలను వినియోగించుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రశాంతంగా సాగేట్టు చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అధికారులు ఉన్నారు.
ఇళ్లగణన పరిశీలన..
కాగజ్‌నగర్‌లో చేపడుతున్న ఇళ్లగణన సర్వేను కలెక్టర్ కెహరిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్లకు కేటాయించిన బ్లాక్‌ను పరిశీలించారు. అనంతరం సర్వే చేస్తున్న సిబ్బందితో మాట్లాడుతూ జనగణన 2027లో భాగంగా చేపట్టిన ఇళ్లగణన ఎంపిక ప్రక్రియను ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. తమకు కేటాయించిన బ్లాక్ పరిఽధిలో ఇంటింటికి వెళ్లి పొరపాట్లు తావు లేకుండా వివరాలు స్పష్టంగా నమోదు చేయాలన్నారు. సర్వేలో పొందు పరిచిన 33 ప్రశ్నలకు సంబంధించి ఇళ్ల యాజమానుల నుంచి వివరాలు సేకరించి ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, తహసీల్దార్ మధుకర్, సిబ్బంది పాల్గొన్నారు.