ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:47 PM
వరిధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. గురువారం మం డలంలోని ఇటిక్యాల, తిమ్మాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొను గోలు కేంద్రాలను తహసీల్దార్ దిలీప్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు.
కలెక్టర్ కుమార్‌దీపక్
లక్షెట్టిపేట, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): వరిధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. గురువారం మం డలంలోని ఇటిక్యాల, తిమ్మాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొను గోలు కేంద్రాలను తహసీల్దార్ దిలీప్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులకు కేంద్రాల్లో అన్ని వస తులు కల్పించాలన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకూడదని కేంద్రాల్లో మం చినీరు, టార్పాలిన్ కవర్లు గన్నీ సంచులు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీన ర్లు అన్ని అందుబాటులో ఉంచాలని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున రైతులు ఉండేందుకు నీడ సౌకర్యం కూడా కల్పించాలన్నారు. రైతులు కూ డా తప్ప, తాలు, మట్టిబెడ్డలు లేకుండా మంచి దాన్యం కేంద్రంకు తీసుకు వచ్చి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలన్నారు. రైతులు కేంద్రంలో ఇచ్చిన ధాన్యం ట్రక్ షీట్‌లో వివరాలు నమోదు చేసి ఆన్‌లైన్ చేయాల న్నారు. రైతులు ఇచ్చిన ధాన్యం డబ్బులు నేరుగా రైతు ఖాతాలో జమచే స్తామని తెలిపారు. రైతులను కేంద్రం నిర్వహకులు ఇబ్బందికి గురి చేస్తే సహించేది లేదన్నారు. అనంతరం పట్టణంలోని 30పడకల ఆసుపత్రిని కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన జనాన్ని వివరా లు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వివిద సమస్యలపై వచ్చిన ప్రజల కు మంచి మెరుగైన వైద్యం అందించాలని వారిపట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ ఆసుపత్రిలో ఉం డాలన్నారు. ఆసుపత్రిలోని ల్యాబ్, మెడికల్‌తో పాటు పలు రికార్డులను ప రిశీలించారు. ఈకార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్, వైద్యులు కృష్ణ, సురేష్‌తో పాటు సిబ్బంది ఉన్నారు.