ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:27 PM
ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో రైతులకు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతో ష్ అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్/ ఉప్పునుంతల, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో రైతులకు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతో ష్ అధికారులను ఆదేశించారు. మంగ ళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అమరేందర్, సం బంధిత అధికారులు, మిల్లర్లు, కాంట్రాక్టర్లతో రబీ 25-26 సీజన్ ధాన్యం కొనుగోళ్ల నిర్వహణ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్‌లో లక్షా43 వేల ఎకరాల్లో వరి పంట సాగైందని, సుమారు 4లక్షల 53వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబ డి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అందుకు తగిన విధంగా జిల్లా యంత్రాంగం అన్ని విభా గాలు డీఆర్‌డీఏ, ఐకేపీ, సహకార, వ్యవసాయ, రెవెన్యూ పోలీస్, మెప్మా అధికారులు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధాన్యం క్వింటాల్ గ్రేడ్-ఏరకానికి రూ. 2,389 మద్దతు ధర, సన్నరకం వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌గా అదనంగా అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధికారి, ఫీల్డ్ సప్లయ్ మేనేజర్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, రైస్ మిల్లు యాజమాన్యాలు పాల్గొన్నారు.
భూసేకరణను వేగవంతంగా చేయాలి
సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణను వేగవం తంగా పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతో ష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరే ట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో క లెక్టర్ నీటిపారుదల, రెవెన్యూ సంబంధిత అధి కారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, రెవె న్యూ, నీటిపారుదల శాఖ అధికారులు, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
ఉప్పునుంతల, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి) : ప్ర జల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకో వాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ఉప్పునుంత లలోని సామాజిక ఆరోగ్య కేంద్రాని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వివిధ విభాగాలను పరిశీలించి, ఆసుపత్రికి వచ్చిన రోగులతో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ సునీత, డీటీ రమేష్ ఉన్నారు.