Share News

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:31 PM

హైదరాబాదు- రం గారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రు ల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అ ర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు పి లుపునిచ్చారు.

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
తిమ్మాజిపేటలో పట్టభద్రుల ఓటు నమోదులో పాల్గొన్న బీజేపీ జిల్లా నాయకులు

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు

తిమ్మాజిపేట, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాదు- రం గారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రు ల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అ ర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు పి లుపునిచ్చారు. మంగళవారం తిమ్మా జిపేటలో బీజేపీ సీనియర్‌ నాయకు డు దాచేపల్లి వేణుగోపాల్‌ ఇంట్లో నిర్వహించి న కార్యకర్తల సమావేశంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీజేపీ బలపరి చిన అభ్యర్ధికి మద్దతు తెలిపి గెలిపించాలని కో రారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకా లను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామగ్రా మాన పర్యటించి పట్టభద్రుల ఓటరు నమో దును వేగవంతం చేయాలని కార్యకర్తలకు సూ చించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్‌గౌడ్‌, నాయకుల జెట్టి వెంక టేష్‌, శ్రీశైలం, రాజు, నరేష్‌, ఆంజనేయులు, శేఖర్‌రెడ్డి, నారాయణ, శివలింగం పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 11:31 PM