Share News

దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వ కృషి: భట్టి

ABN , Publish Date - Feb 01 , 2026 | 07:08 AM

దివ్యాంగుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వ కృషి: భట్టి

హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. కేరళకు చెందిన దివ్యాంగ్‌ చైల్డ్‌ ఉమెన్‌ వెల్ఫేర్‌ సొసైటీకి చెందిన సభ్యులు శనివారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. దివ్యాంగులు కూడా సమాజంలో భాగమేనని, వారి అభ్యున్నతికి అన్ని ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. కేరళలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమని, ఆ ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాలతో సమానంగా దివ్యాంగులకు అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

Updated Date - Feb 01 , 2026 | 07:08 AM